Share News

ఘనంగా బీరన్న కామరాతిల కల్యాణం

ABN , Publish Date - May 26 , 2024 | 10:30 PM

సీతారాంపల్లి గొల్లవాడలోని బీరన్న ఆలయంలో ఆదివారం గొల్ల, కురుమల కుల ఆచారం ప్రకారం బీరన్న కామరాతిల కల్యాణ మహోత్సవం కన్నుల పండవగా జరిగింది. బీరన్న పూజారులు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహిం చారు.

ఘనంగా బీరన్న కామరాతిల కల్యాణం

నస్పూర్‌, మే 26: సీతారాంపల్లి గొల్లవాడలోని బీరన్న ఆలయంలో ఆదివారం గొల్ల, కురుమల కుల ఆచారం ప్రకారం బీరన్న కామరాతిల కల్యాణ మహోత్సవం కన్నుల పండవగా జరిగింది. బీరన్న పూజారులు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహిం చారు. ఉదయం 110 పైగా లగ ్నం బోనాలతో గొల్ల, కురుమ కుటుంబ సభ్యులు ఒకే రంగు చీరలను ధరించి బోనాలను పెద్ద ఎత్తుకుని ఉరేగింపుగా వచ్చారు. బీరన్న కళాకారులు పసుపు, గంధం పూసుకుని డోలు తాళం కొట్టుకుంటూ శివసత్తుల పూనకాల నడుమ ఆలయం వద్దకు చేరుకున్నారు. పూజారులు పట్నం వేశారు. కుల గురువు అయ్యల బీరయ్య కామరాతిల కల్యాణాన్ని కుల పెద్దలు, కమిటీ సభ్యుల మధ్య కన్నుల పండుగా నిర్వహిం చారు. ఐదేళ్ళకొకసారి నిర్వహించే కల్యాణానికి గొల్ల, కురుమ కుటుంబ సభ్యులతోపాటు గ్రామ స్థులు, చుట్టుపక్క గ్రామాల ప్రజలు తిలకించారు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్షాకు చెందిన డోలు కళాకారుల విన్యాసాలు అకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2024 | 10:30 PM