Share News

డ్రైవింగ్‌ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - May 24 , 2024 | 10:21 PM

డ్రైవింగ్‌ చేసేటప్పుడు అప్రమ త్తంగా ఉండాలని రామగుండం సీపీ శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం కమిషనరేట్‌ పరిధిలోని పోలీ సు డ్రైవర్లతో హెడ్‌క్వార్టర్‌లో అవగాహన కార్యక్ర మం నిర్వహించారు.

డ్రైవింగ్‌ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి

ఏసీసీ, మే 24: డ్రైవింగ్‌ చేసేటప్పుడు అప్రమ త్తంగా ఉండాలని రామగుండం సీపీ శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం కమిషనరేట్‌ పరిధిలోని పోలీ సు డ్రైవర్లతో హెడ్‌క్వార్టర్‌లో అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో అధికారుల వద్ద అప్రమ త్తంగా ఉంటూ డ్రైవింగ్‌ చేయాలన్నారు. వాహ నాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మంచి కండీషన్‌లో ఉంచుకోవాలని సూచించారు. పోలీసు అధికారుల ఆధీనంలో ఉన్న వాహనాలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, సొంత వాహనంలా భావిం చి సర్వీసింగ్‌, ఇంజన్‌ ఆయిల్‌, టైర్ల నిర్వహణ చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల యేటా లక్షా 69 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, 4 లక్షల మంది క్షతగాత్రులు అవుతున్నారన్నారు. నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందని, చిన్న నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదం సంభవించి కుటుంబ భవిష్యత్‌ అంధకారమవుతుందన్నారు. డ్రైవింగ్‌ చేసేటప్పుడు సెల్‌ఫోన్‌లో మాట్లాడవద్దని, సీటు బెల్టు ధరించాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు చుట్టూ పరిస్థితు లను గమనించాల న్నారు. ఒక్కసారి డ్రైవింగ్‌ సీట్లో కూర్చున్న తర్వాత పూర్తిగా డ్రైవింగ్‌ పైనే దృష్టి సారిం చాలని, ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాల న్నారు. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ రాజు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ రాఘవేంద్రరావు, ఎంటీవో మధు, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2024 | 10:21 PM