Share News

మలేరియాపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:09 PM

ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరిం చుకుని గురువారం వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుబ్బారాయుడు పీహెచ్‌సీ నుంచి జెండా ఊపి ఉరేగింపును ప్రారంభించారు.

మలేరియాపై అప్రమత్తంగా ఉండాలి

నస్పూర్‌, ఏప్రిల్‌ 25: ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరిం చుకుని గురువారం వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుబ్బారాయుడు పీహెచ్‌సీ నుంచి జెండా ఊపి ఉరేగింపును ప్రారంభించారు. దోమలను నివారిస్తే మలేరియా నిర్మూ లన సాధ్యమవుతుందని, ప్రజలు పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం గా ఉంచుకోవాలని సూచించారు. మలేరియా నివారణపై ప్రతిజ్ఞ చేశారు. వైద్యులు సమత, సబ్‌ యూనిట్‌ అధికారి నాందేవ్‌, హెల్త్‌ ఎడ్యూకేటర్‌ అల్లాడి శ్రీనివాస్‌, సీహెచ్‌ఓలు పాల్గొన్నారు.

కోటపల్లి: మలేరియాపై అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి సోకకుం డా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారి సత్యనారాయణ సూచిం చారు. కోటపల్లి మండల కేంద్రంలో వైద్య ఆరోగ్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. మలేరియా వ్యాధి సోకే విధానం, దోమలు, రకాలు, కీటక జనిత వ్యాధుల నియంత్రణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సూపర్‌వైజర్‌ జ్యోతి, హెల్త్‌ అసిస్టెంట్‌ సుధాకర్‌, సిబ్బంది శ్రీనివాస్‌, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

మందమర్రిరూరల్‌: పొన్నారంలో మలేరియా దినోత్సవాన్ని పురస్క రించుకుని వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. పరిస రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూసు కోవాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఏఎన్‌ఎం గ్లోరి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

వడదెబ్బ తగలకుండ జాగ్రత్తలు తీసుకోవాలి

దండేపల్లి: మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వడదెబ్బ నివారణపై ఆశ కార్యకర్తలకు డీఎం హెచ్‌వో సుబ్బారాయుడు అవగాహన కల్పించారు. వడదెబ్బ సోకిన ప్పుడు స్ధానిక ఆసుప్రతికి వెళ్లి వైద్యం చేయించుకోవాలన్నారు. చెమట రూపంలో నీరు వెళ్లడం వల్ల డీహైడ్రేషన్‌కు గురవుతారన్నారు. వడదెబ్బపై వైద్య సిబ్బంది ప్రజలకు కర్రపతాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ఆసుపత్రిలో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జిల్లా ప్రోగ్రాం అధికారి శివప్రతాప్‌, వైద్యాధికారి డాక్టర్‌ సతీష్‌, వైద్య సిబ్బంది, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:09 PM