Share News

ఎమ్మెల్యేపై నిరాధార ఆరోపణలు మానుకోవాలి

ABN , Publish Date - Jul 08 , 2024 | 11:21 PM

మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావుపై మాజీ ఎమ్మెల్యే దివాకర్‌ రావు నిరాధార ఆరోపణలు మానుకోవాలని కాంగ్రెస్‌ నాయకులు పేర్కొన్నారు. సోమవారం ఎమ్మెల్యే నివా సంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్‌, మహిళా విభాగం అధ్యక్షురాలు హేమలత మాట్లాడారు.

ఎమ్మెల్యేపై నిరాధార ఆరోపణలు మానుకోవాలి

మంచిర్యాల అర్బన్‌, జూలై 8: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావుపై మాజీ ఎమ్మెల్యే దివాకర్‌ రావు నిరాధార ఆరోపణలు మానుకోవాలని కాంగ్రెస్‌ నాయకులు పేర్కొన్నారు. సోమవారం ఎమ్మెల్యే నివా సంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్‌, మహిళా విభాగం అధ్యక్షురాలు హేమలత మాట్లాడారు. ప్రజలు దివాకర్‌రావును ఎన్ని కల్లో ఓడించినా బుద్ధి రావడం లేదన్నారు. ఎమ్మెల్యేపై వెలువడిన లేఖలపై పోలీసులు విచారణ జరుపుతు న్నారన్నారు. భూకబ్జాల కేసులో వారి ప్రధాన అనుచ రుడు అరెస్టు అయ్యాడని గుర్తుచేశారు. గోదావరి ఒడ్డున మాతా శిశు ఆసుపత్రిని నిర్మించి కోట్ల రూపా యల ప్రజాధనం వృథా చేశాడన్నారు. అందరికి అం దుబాటులో ఉండేలా ఐబీ ప్రాంతంలో ఆసుపత్రిని నిర్మించాలని ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటుంటే దివాకర్‌ రావు అడ్డుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు. 20 యేండ్ల తన పాలనలో ఏ మేరకు అభివృద్ధి చేశారో నిరూపించాలని సవాల్‌ చేశారు. అధికారంలో లేకున్నా ప్రేంసాగర్‌రావు నియోజకవర్గ ప్రజలకు వారి ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేశారని, దివాకర్‌రావు లాగా ఎన్నికలు ముగిసిన వెంటనే ట్రస్టును ఎత్తివేయ లేదన్నారు. మరోసారి ఎమ్మెల్యేపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించమని హెచ్చరించారు. నాయకులు చిట్ల సత్యనారాయణ, రామగిరి బానేష్‌, బొలిశెట్టి కిషన్‌, అబ్దుల్‌ మాజీద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 11:21 PM