Share News

నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

ABN , Publish Date - May 27 , 2024 | 10:29 PM

నూతన చట్టాలపై పోలీస్‌ అధికా రులు, సిబ్బంది అవగాహన పెంచుకోవాలని రామగుం డం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం కమిషనరేట్‌ పరిధిలోని పోలీసు అధికారులకు రామ గుండం హెడ్‌ క్వార్టర్స్‌లో వర్క్‌షాప్‌ ఆన్‌ న్యూ క్రిమి నల్‌ లాస్‌(ఎన్‌సీఎల్‌)పై అవగాహన కార్యక్రమం నిర్వ హించారు.

నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

ఏసీసీ, మే 27: నూతన చట్టాలపై పోలీస్‌ అధికా రులు, సిబ్బంది అవగాహన పెంచుకోవాలని రామగుం డం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం కమిషనరేట్‌ పరిధిలోని పోలీసు అధికారులకు రామ గుండం హెడ్‌ క్వార్టర్స్‌లో వర్క్‌షాప్‌ ఆన్‌ న్యూ క్రిమి నల్‌ లాస్‌(ఎన్‌సీఎల్‌)పై అవగాహన కార్యక్రమం నిర్వ హించారు. సీపీ మాట్లాడుతూ జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం నూతన నేర, న్యాయ చట్టాలు 2023 అమ లులోకి తేనున్న నేపథ్యంలో కేసుల దర్యాప్తు, విచా రణలో పాటించాల్సిన విధానాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి పోలీసు అధికారికి, సిబ్బందికి నూతన చట్టాలపై అవగాహన ఉంటేనే రానున్న రోజు ల్లో బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎలా స్వీక రించాలి, ఏయే సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి, స్టేషన్‌ బెయిల్‌కు ఎవరు అర్హులు, చార్జీషీట్‌ ఎలా తయారు చేయాలి, నిందితులకు శిక్షలు ఖరారు చేయ డంలో దర్యాప్తు అధికారులు ఎలా వ్యవహరించాలి తదితర అంశాలపై కొత్త చట్టంలో మార్పులు చేర్పులు చేశారని వివరించారు. నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు, విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలు కలుగుతుందన్నారు. పాత విధానాలలో నూతన చట్టాలకు విరుద్ధమైన వాటిని పాటించకూడదని, నూతన సెక్షన్ల ప్రకారం మాత్రమే వివిధ రకాల కేసులను నమోదు చేయాల్సి ఉంటుందని సీపీ పేర్కొన్నారు. అధికారులకు, సిబ్బందికి తెలంగాణ పోలీస్‌ అకాడ మీలో శిక్షణ పొందిన అధికారులతో బ్యాచ్‌ల వారీగా నెల రోజుల పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. అడిష నల్‌ డీసీపీ అడ్మిన్‌ రాజు, ఏఆర్‌ ఏసీపీ ప్రతాప్‌, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2024 | 10:29 PM