Share News

హెచ్‌ఐవీపై అవగాహన అవసరం

ABN , Publish Date - Jan 18 , 2024 | 10:17 PM

హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుబ్బారా యుడు పేర్కొన్నారు. గురువారం ఓవర్‌ బ్రిడ్జి, కూరగాయల మార్కెట్‌, బస్టాండ్‌ ప్రాంతాల్లో ఎయిడ్స్‌ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో కళాకా రుల అవగాహన ప్రదర్శనను జెండా ఊపి ప్రారంభించారు.

హెచ్‌ఐవీపై అవగాహన అవసరం

మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 18 : హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుబ్బారా యుడు పేర్కొన్నారు. గురువారం ఓవర్‌ బ్రిడ్జి, కూరగాయల మార్కెట్‌, బస్టాండ్‌ ప్రాంతాల్లో ఎయిడ్స్‌ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో కళాకా రుల అవగాహన ప్రదర్శనను జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లా డుతూ సుఖవ్యాధులు ఉన్న వారికి హెచ్‌ఐవీ వ్యాధి సోకే అవకాశం ఎక్కు వగా ఉంటుందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షల వివరాలు రహ స్యంగా ఉంచుతామన్నారు. కళాజాత బృందం కళాకారులు ఆటాపాటల ద్వారా హెచ్‌వీఐ, సుఖవ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మాస్‌ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సూపర్‌వైజర్‌ అనిల్‌కుమార్‌, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సిబ్బంది, కళాకారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 10:17 PM