Share News

ఏనుగుల నుంచి రక్షణపై అవగాహన సదస్సు

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:12 PM

గోదావరి, ప్రాణహిత తీరాన్ని దాటి ఏను గుల గుంపు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై అటవీ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన సదస్సులో అటవీ శాఖ రేంజర్‌ రవి, ఎంపీడీవో ఆకుల భూమన్న, పశు వైద్యాధికారి పవన్‌కుమార్‌, విద్యుత్‌ శాఖ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు పంచాయతీ కార్యదర్శులకు, వాలంటీర్లకు, ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.

ఏనుగుల నుంచి రక్షణపై అవగాహన సదస్సు

కోటపల్లి, ఏప్రిల్‌ 27: గోదావరి, ప్రాణహిత తీరాన్ని దాటి ఏను గుల గుంపు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై అటవీ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన సదస్సులో అటవీ శాఖ రేంజర్‌ రవి, ఎంపీడీవో ఆకుల భూమన్న, పశు వైద్యాధికారి పవన్‌కుమార్‌, విద్యుత్‌ శాఖ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు పంచాయతీ కార్యదర్శులకు, వాలంటీర్లకు, ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఏనుగులకు చూపు తక్కువగా ఉంటుందని, వినికిడి ఎక్కువగా ఉంటుందని, వాసన దూరం నుంచే పసిగడుతుం దని పేర్కొన్నారు. సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండా లని, ఏనుగుల సంచారంపై అటవీ శాఖ అధికారులకు వెంటనే తెలి యజేయాలని పేర్కొన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో బైనాక్యులర్‌ సహాయంతో ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ప్రజలు దీనిపై అప్రమ త్తంగా ఉండాలని రేంజర్‌ రవి కోరారు. ఒక వేళ ఏనుగుల గుంపు వచ్చినా అవి ఎంతో కాలం ఉం డవని వచ్చిపోతాయని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ముందు జాగ్రత్తగా ఆయా గ్రామాల్లో అటవీ సిబ్బంది సహకారంతో అవగాహన సదస్సులతో ప్రజలకు తెలిసేలా చాటింపు చేపట్టినట్లు రేంజర్‌ వివరించారు.

Updated Date - Apr 27 , 2024 | 11:12 PM