Share News

నీటి వినియోగ సామర్ధ్యంలో ఎస్టీపీపీకి అవార్డు

ABN , Publish Date - Mar 08 , 2024 | 10:18 PM

జైపూర్‌ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం జాతీయ స్థాయిలో నీటి వినియోగ సామర్ధ్యంలో అత్యుత్తమ యూనిట్‌గా అవార్డును అందు కుంది.

నీటి వినియోగ సామర్ధ్యంలో ఎస్టీపీపీకి అవార్డు

జైపూర్‌, మార్చి 8: జైపూర్‌ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం జాతీయ స్థాయిలో నీటి వినియోగ సామర్ధ్యంలో అత్యుత్తమ యూనిట్‌గా అవార్డును అందు కుంది. ప్రతిష్టాత్మక కౌన్సిల్‌ ఆఫ్‌ ఎన్విరో ఎక్స లెన్స్‌ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరిగిన ద్వితీయ స్థాయి అత్యుత్తమ థర్మల్‌ ప్లాంట్ల బహుమతి ప్రదానోత్సవంలో జైపూర్‌ విద్యుత్‌ కేంద్రానికి బెస్ట్‌ నేషనల్‌ వాటర్‌ ఎఫిషియంట్‌ యూనిట్‌ అవార్డును అందజేశారు. 500 మెగావాట్లపై బడిన సామర్ధ్యం గల సుమారు 150 ప్రభుత్వ, ప్రైవేటు రంగ విద్యుత్‌ కేంద్రాల్లో సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం అవార్డును సాధించ డంపై సింగరేణి సీఎండీ బలరాం, డైరెక్టర్‌ ఈఅండ్‌ఎం సత్యనారాయణ రావులు హర్షం వ్యక్తం చేశారు. విద్యు త్‌ ఉత్పాదతకతకు తక్కువ నీటిని ఉపయోగించడానికి సింగరేణి యాజ మాన్యం వినూత్నమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుందన్నారు. హైడ్రోబిన్‌ సిస్టం విని యోగించడం వల్ల నీటి వినియోగం తక్కువగా ఉంటుందన్నారు. ఐఆర్‌ఈడీ మాజీ డైరెక్టర్‌ సుబ్బారావు చేతుల మీదుగా ఈ అవార్డును చంద్రలింగం అందుకున్నారు.

Updated Date - Mar 08 , 2024 | 10:18 PM