Share News

ఆటో కార్మికులకు నెలకు రూ. 12 వేలు ఇవ్వాలి

ABN , Publish Date - Apr 16 , 2024 | 10:40 PM

రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు నెలకు రూ. 12 వేల జీవన భృతి ఇవ్వాలని ఆటో యూనియన్‌ రాష్ట్ర జేఏసీ నాయకులు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు హాలులో నిర్వహించిన రాష్ట్ర స్ధాయి సమావేశంలో వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరై మాట్లాడారు.

ఆటో కార్మికులకు నెలకు రూ. 12 వేలు ఇవ్వాలి

ఏసీసీ, ఏప్రిల్‌ 16: రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు నెలకు రూ. 12 వేల జీవన భృతి ఇవ్వాలని ఆటో యూనియన్‌ రాష్ట్ర జేఏసీ నాయకులు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు హాలులో నిర్వహించిన రాష్ట్ర స్ధాయి సమావేశంలో వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ పథకంతో ఆటోలు నడుపుతూ జీవనం సాగించే వారికి ఉపాధి కరువై నష్టపోయారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.12 వేలు అందించాలన్నారు. జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్‌, అధికార ప్రతినిధి మధు, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌, మధుకర్‌, రాజగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 10:40 PM