Share News

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

ABN , Publish Date - May 19 , 2024 | 10:36 PM

రామకృష్ణాపూర్‌ సివి రామన్‌ ఉన్నత పాఠశాల పదో తరగతి 1998-99 బ్యాచ్‌ సిల్వర్‌ జూబ్లీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం వైభవంగా జరుపుకున్నారు. అప్పటి జ్ణాప కాలను గుర్తు చేసుకున్నారు.

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

రామకృష్ణాపూర్‌, మే 19: రామకృష్ణాపూర్‌ సివి రామన్‌ ఉన్నత పాఠశాల పదో తరగతి 1998-99 బ్యాచ్‌ సిల్వర్‌ జూబ్లీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం వైభవంగా జరుపుకున్నారు. అప్పటి జ్ణాప కాలను గుర్తు చేసుకున్నారు. సుమారు 150 మంది పూర్వ విద్యార్థులు పాల్గొని సందడి చేశారు. సిం గరేణి జీవన విధానాన్ని ప్రతిబింబించేలా రచయిత గురిజాల రవిందర్‌రావు రాసిన బొగ్గు రవ్వలు పుస్త కాన్ని ఆవిష్కరించారు. పాఠశాల కరస్పాండెంట్‌ గు రిజాల రవిందర్‌రావు, ప్రధానోపాధ్యాయులు సురేం దర్‌ రావు, ఉప్పలయ్య, చిరంజీవి, రమేష్‌ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మంచిర్యాల కలెక్టరేట్‌: మంచిర్యాలలోని ఎంవీ ఎన్‌ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ మైక్రో బయాలజీ చది విన వారు 20 ఏండ్ల క్రితం ఆదివారం మంచి ర్యాలలోని వీ కన్వెన్షన్‌ హాలులో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఉత్సాహంగా గడిపారు. సహ విద్యార్ధి జిల్లా రచయితల వ్యవస్ధాపక అధ్యక్షుడు బొడ్డు మహేందర్‌ను సన్మానించారు. రాజేష్‌, మల్లాగౌడ్‌, రమేష్‌, నరేష్‌, స్రవంతి, స్వప్న, పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2024 | 10:36 PM