Share News

రాజ్యాంగాన్ని అందించిన మహానీయుడు అంబేద్కర్‌

ABN , Publish Date - Apr 14 , 2024 | 10:36 PM

దేశానికి రాజ్యాం గాన్ని అందించిన మహానీయుడు డాక్టర్‌ బీఆర్‌ అంబే ద్కర్‌ అని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. ఆదివారం ఐబీ చౌరస్తాలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

రాజ్యాంగాన్ని అందించిన మహానీయుడు అంబేద్కర్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 14: దేశానికి రాజ్యాం గాన్ని అందించిన మహానీయుడు డాక్టర్‌ బీఆర్‌ అంబే ద్కర్‌ అని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. ఆదివారం ఐబీ చౌరస్తాలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్‌ మా ట్లాడుతూ అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగం ద్వారా దేశంలోని బడుగు, బలహీన, అణగారిన వర్గా లకు స్వేచ్ఛ, సమానత్వం హక్కులు లభించాయ న్నారు. షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ జిల్లా ఉపసంచాలకులు పోటు రవీందర్‌, కార్పొరేషన్‌ ఈడీ దుర్గా ప్రసాద్‌, డీఆర్‌డీవో కిషన్‌, జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్య, వయోజన విద్యాధికారి పురుషోత్తం, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.

అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

మందమర్రిటౌన్‌: అంబేద్కర్‌ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే వివేక్‌వెంకట స్వామి పేర్కొన్నారు. పట్టణంలో నిర్వహించిన అంబే ద్కర్‌ జయంతి వేడుకలకు ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్‌ అని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, వెంకట్రావు, రాంబాబు, వీరస్వామి, రవీందర్‌, నరేష్‌, వాసాల సంపత్‌, జగదీష్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ జయంతి నిర్వహించారు. సంజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. కాం గ్రెస్‌ నాయకులు, బీసీ సంఘం నాయకులు సొత్కు సుదర్శన్‌, కిరణ్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. మాలమహానాడు, ప్రైవేటు పాఠశాలల అసో సియేషన్‌ నాయకులు, ప్రజాసేవ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ జయంతి నిర్వహించారు. మందమర్రిలో అంబేద్కర్‌ కమ్యూనిటీ భవన నిర్మాణా నికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులు ఐకమత్యంగా ఉండాలని సూచించారు. మందమర్రిలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తానని తెలిపారు.

చెన్నూరు: అంబేద్కర్‌ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. పాత బస్టాండ్‌ ప్రాంతంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌ అన్ని వర్గాల వారికి ఎంతో మేలు చేశారని కొనియాడారు. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్‌, జిల్లా పరి షత్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ మూల రాజిరెడ్డి, అంబేద్కర్‌ యువజన సంఘం అధ్యక్షుడు వెంకటి, పాల్గొన్నారు.

భీమారం: మండల కేంద్రంలోని ఆవడం, బస్టాండ్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహాలకు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అంబేద్కర్‌ చేసిన సేవలను కొనియాడారు. నాయకులు లక్ష్మణ్‌, అమ ర్‌సింగ్‌, శ్రీనివాస్‌, తిరుపతి, మల్లేష్‌, బలరాం రెడ్డి పాల్గొన్నారు. సుంకరిపల్లిలోని నేతకానివాడలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్ను లు, ప్యాడ్‌లతో పాటు స్వీట్‌లను కాంగ్రెస్‌ నాయకుడు దుర్గం రాజు అందజేశారు.

Updated Date - Apr 14 , 2024 | 10:36 PM