Share News

అంబేద్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించాలి

ABN , Publish Date - Apr 12 , 2024 | 10:30 PM

అంబేద్కర్‌ జయంతిని ఈ నెల 14న ఘనంగా నిర్వహించాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ మారుతిప్రసాద్‌కు వినతిపత్రం అం దించారు.

అంబేద్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించాలి

ఏసీసీ, ఏప్రిల్‌ 12: అంబేద్కర్‌ జయంతిని ఈ నెల 14న ఘనంగా నిర్వహించాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ మారుతిప్రసాద్‌కు వినతిపత్రం అం దించారు. నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్‌, చేరాల వంశీలు మాట్లాడుతూ ఐబీ చౌరస్తా, ఏసీసీ అంబేద్కర్‌ విగ్రహాల వద్ద ఏర్పాట్లు చేయాలన్నారు. పార్టీ, మత పరమైన జెండాలు, బ్యానర్లు పెట్టకుండా చూడాలన్నారు.

నస్పూర్‌: అంబేద్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మాల సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు గోసిక మనోజ్‌ తెలిపారు. సీసీసీ కార్నర్‌ వద్ద సంఘ ముఖ్య నేతల సమావేశం జరి గింది. ఆయన మాట్లాడుతూ మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబే ద్కర్‌ జయంతిని ఆదివారం ఉదయ 9 గంటలకు జెండా ఆవిష్కరణ, మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం 5గంటలకు ర్యాలీ ఉంటుంద న్నారు. బహుజనులు, సింగరేణి కార్మికులు, యువకులు, వ్యాపారులు, మహిళలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. నందయ్య, సుర్మిళ్ళ కిరణ్‌, ఓలెపు రవి, శరణ్‌, శ్రీనివాస్‌, పీక సతీష్‌, నవీన్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 10:30 PM