Share News

ఎమ్మెల్యే ఎదుట ఆదివాసీల నిరసన

ABN , Publish Date - Jan 05 , 2024 | 10:48 PM

దేవాపూర్‌ ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీలో శుక్ర వారం గేట్‌ మీటింగ్‌కు హాజరైన ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను ఆదివాసీ సం ఘాలు అడ్డుకుని నిరసన తెలిపాయి. గతంలో ఓరియంట్‌ సిమెంట్‌ కం పెనీ గుర్తింపు సంఘం అధ్యక్షుడిగా ఉన్న రాములునాయక్‌ వల్ల ఆదివాసీ లకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే ఎదుట ఆదివాసీల నిరసన

కాసిపేట, జనవరి 5: దేవాపూర్‌ ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీలో శుక్ర వారం గేట్‌ మీటింగ్‌కు హాజరైన ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను ఆదివాసీ సం ఘాలు అడ్డుకుని నిరసన తెలిపాయి. గతంలో ఓరియంట్‌ సిమెంట్‌ కం పెనీ గుర్తింపు సంఘం అధ్యక్షుడిగా ఉన్న రాములునాయక్‌ వల్ల ఆదివాసీ లకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. రాములునాయక్‌కు మద్దతుగా ఎమ్మెల్యే వస్తుండగా అడ్డుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తుడుందెబ్బ జిల్లా అద్యక్షుడు మడావి వెంకటేష్‌ మాట్లాడుతూ గతంలో గుర్తింపు సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన రాములు నాయక్‌ స్ధానిక ఆదివాసీలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారని తెలిపారు. రాములునాయక్‌కు ఎమ్మెల్యే మద్దతు ఉపసం హరించుకోవాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేకు అందించారు. స్ధానిక ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 10:48 PM