Share News

పంట నష్టపరిహారానికి చర్యలు చేపట్టాలి

ABN , Publish Date - Apr 02 , 2024 | 10:16 PM

గ్రామీణ ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులను ఆదుకో వాలని మంగళవారం బీఆర్‌ఎస్‌ నేతలు జిల్లా అధికా రులకు వినతిపత్రం అందించారు. కలెక్టరేట్‌ వద్ద మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు మాట్లాడు తూ నీరందక పంటలు ఎండిపోతున్నాయని, చేతి కందే దశలో పంటలు నష్టపోవడంతో రైతులు ఆం దోళన చెందుతున్నారన్నారు.

పంట నష్టపరిహారానికి చర్యలు చేపట్టాలి

నస్పూర్‌, ఏప్రిల్‌ 2: గ్రామీణ ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులను ఆదుకో వాలని మంగళవారం బీఆర్‌ఎస్‌ నేతలు జిల్లా అధికా రులకు వినతిపత్రం అందించారు. కలెక్టరేట్‌ వద్ద మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు మాట్లాడు తూ నీరందక పంటలు ఎండిపోతున్నాయని, చేతి కందే దశలో పంటలు నష్టపోవడంతో రైతులు ఆం దోళన చెందుతున్నారన్నారు. పంటల నష్టం అంచ నాలు తయారు చేయడానికి అధికార బృందాలను నియమించి నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదిక పంపాలన్నారు. ఎకరానికి రూ. 25వేల నష్ట పరిహా రం ఇప్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వరి పంటతోపాటు ఇతర పంటలకు మద్దతు ధరకు అదనంగా రూ. 500 రూపాయలు చెల్లించాలన్నారు. యాసంగి పంటలకు బోనస్‌ చెల్లించే విధంగా చర్య లు చేపట్టాలన్నారు. మంచిర్యాల, నస్పూ ర్‌ చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు గాదె సత్యం, గోగుల రవీం దర్‌ రెడ్డి, సీపతి శ్రీని వాస్‌, వంగ తిరుపతి, గౌస్‌, గరిసె భీమ య్య, ముక్కెల వెంక టేశ్‌, చంద్రశేఖర్‌, మెరు గు ప్రవన్‌కుమార్‌, మల్లే ష్‌, అంకం నరేష్‌, తిప్పని రామయ్య, వెంకట్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2024 | 10:16 PM