Share News

తైబజార్‌ రద్దు చేయడం హర్షణీయం

ABN , Publish Date - Apr 13 , 2024 | 10:07 PM

మంచిర్యాల మున్సిపాలిటీలో తైబజార్‌ను రద్దు చేయడం హర్షణీయమని కూరగాయల వ్యాపారులు, చిరు వ్యాపారులు అన్నారు. శనివారం కూరగాయల మార్కెట్‌లో నిర్వహించిన సమావేశంలో కూరగాయల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ తైబజార్‌ రద్దు వల్ల చిరు వ్యాపారులకు ఆర్థిక వెసలుబాటు కలిగిందన్నారు.

తైబజార్‌ రద్దు చేయడం హర్షణీయం

ఏసీసీ, ఏప్రిల్‌ 13: మంచిర్యాల మున్సిపాలిటీలో తైబజార్‌ను రద్దు చేయడం హర్షణీయమని కూరగాయల వ్యాపారులు, చిరు వ్యాపారులు అన్నారు. శనివారం కూరగాయల మార్కెట్‌లో నిర్వహించిన సమావేశంలో కూరగాయల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ తైబజార్‌ రద్దు వల్ల చిరు వ్యాపారులకు ఆర్థిక వెసలుబాటు కలిగిందన్నారు. గతంలో తైబజార్‌ పేరిట రోజు కూరగాయల వ్యాపారులు, ఇతర వీధి వ్యాపారులు, చిరు వ్యాపారుల నుంచి మున్సిపాలిటీలో టెండర్‌ పాడిన కాంట్రాక్టర్‌ పన్ను వసూలు చేసేవారన్నారు. తైబజార్‌ను రద్దు చేయించినందుకు ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌ నాయకులు తూముల నరేష్‌, పూదరి తిరుపతి, జోగుల సదానందం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2024 | 10:07 PM