Share News

గోదావరిపై బ్రిడ్జి నిర్మించాలి

ABN , Publish Date - Mar 22 , 2024 | 10:23 PM

గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. శుక్రవారం మంచిర్యాలలోని ఆయన నివా సంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

గోదావరిపై బ్రిడ్జి నిర్మించాలి

ఏసీసీ, మార్చి 22: గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. శుక్రవారం మంచిర్యాలలోని ఆయన నివా సంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అంతర్గాం వైపు బ్రిడ్జిని ఆనుకుని నిర్మించనున్న రోడ్డుకు సంబం ధించిన అలైన్‌మెంట్‌ను తాను మార్పిం చానని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ఆరోపిం చడం అవాస్తవమన్నారు. తాను అలైన్‌ మెంట్‌ మార్పించలేదన్నారు. మంచిర్యాల- అంతర్గాంను కలుపుతూ పట్టణంలోని కాలేజీ రోడ్డు వద్ద బ్రిడ్జి నిర్మిస్తే భూసేక రణ సులభతరం అవుతుందని, వేరే చోట నిర్మిస్తే బడ్జెట్‌ పెరుగుతుందన్నారు. బేషజాలకు పోకుండా ప్రజాప్రయోజనాల కోసం మంచిర్యాల గోదావరిపై బ్రిడ్జిని నిర్మించాలన్నారు. వెంటనే నిర్మాణం ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 10:23 PM