Share News

లక్ష్యసాధనకు 45 రోజులే

ABN , Publish Date - Feb 15 , 2024 | 10:18 PM

బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునే గడువు సమీపిస్తోంది. మార్చి 31తో వార్షిక లక్ష్యం చేరుకొనేందుకు ఇంకా 45 రోజులే మిగిలింది. దీంతో రోజు అధికారులు ఉత్పత్తిని పర్యవేక్షిస్తుండగా, లక్ష్యం దిశగా ఏరియా కార్మికులు శ్రమిస్తున్నారు.

లక్ష్యసాధనకు 45 రోజులే

శ్రీరాంపూర్‌, ఫిబ్రవరి 15: బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునే గడువు సమీపిస్తోంది. మార్చి 31తో వార్షిక లక్ష్యం చేరుకొనేందుకు ఇంకా 45 రోజులే మిగిలింది. దీంతో రోజు అధికారులు ఉత్పత్తిని పర్యవేక్షిస్తుండగా, లక్ష్యం దిశగా ఏరియా కార్మికులు శ్రమిస్తున్నారు.

సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 70 మిలియన్‌ టన్నులు కాగా, గురువారం వరకు 59.35 మిలియన్‌ టన్నులు సాధించింది. ఇంకా సుమారు 10.65 మిలియన్‌ టన్నులు సాధించాల్సి ఉంది. ఇక శ్రీరాంపూర్‌ ఏరియాకు నిర్దేశించిన లక్ష్యం 66.40 లక్షల టన్నులు. గురువారం వరకు ఈ నిర్దేశిత లక్ష్యంలో 49.38 లక్షల టన్నులు సాధించారు. మిగిలిన రోజుల్లో లక్ష్యాన్ని చేరుకోవడానికినిత్యం 37 వేల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాల్సి ఉంది. కానీ రోజు 20 వేల టన్నుల ఉత్పత్తి దాటే పరిస్థితి కనిపించడం లేదు.

లక్ష్యం సాధించేనా ?

ఈ ఆర్థిక సంవత్సరం 70 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కాగా, అనుకున్న మేరకు ఉత్పత్తిని సాధించలేకపోతున్నామని గ్రహించిన సీఎండీ బలరాం ప్రత్యేక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. కరోనాకు ముందు నాలుగేళ్ల క్రితం మల్టీడ ిపార్ట్‌మెంటల్‌ సమావేశాలు ఏర్పాటు చేసి లక్ష్యాన్ని సాధించగా, మళ్లీ అదే పంథాను కొనసాగించేందుకు ఈసారి కూడా అదే మాదిరిగా అన్ని విభాగాల అధికారులు, యూనియన్‌ నాయకులతో కలిసి మల్టీ డిపార్ట్‌మెంటల్‌ (ఎండీటీ) సమావేశాలు నిర్వహించారు. ఇవి ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కొన సాగాయి. ఇందులో భాగంగా రోజుకు ఒఒ గనిపై సమావేశం ఏర్పాటు చేసి వివిధ అంశాలపై కార్మికులకు అవగాహన కల్పించారు. గనుల్లో బొగ్గు ఉత్పత్తి పెంచడం, ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించడం, నాణ్యతా ప్రమాణాలు పెంచడం, ఉద్యోగుల సంక్షేమం వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. వీటికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేశారు. సమావేశాలకు ఎస్‌ఓ టు జీఎం కన్వీనర్‌గా రక్షణ, ఈఅండ్‌ఎం, ఫైనాన్స్‌, పర్సనల్‌, ఐఈడీ, క్వాలిటీ తదితర ఉన్నతాధికారులు సభ్యులుగా వ్యవహరించారు. ప్రతీ గనిని సందర్శించి ఉత్పత్తి, ఉత్పాదకతపై చర్చించారు. ఒక్కో కార్మికుడు ఉత్పత్తికి ఏ మేరకు సహకరించాలి, యంత్రాలను ఏ మేరకు వినియోగించాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగానే ఈ నెల 8న ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(కోల్‌ మూమెంట్‌) సీసీసీలోని సింగరేణి విశ్రాంతి గృహంలో అన్ని విభాగాల అధిపతులతో సమావేశం నిర్వహించారు. బొగ్గు ఉత్పత్తి, రవాణాను సమక్షించి, మిగిలిన లక్ష్యాన్ని చేరుకునేందుకు దిశానిర్దేశం చేశారు. అలాగే ఇతర డైరెక్లర్లు సైతం ఏరియాలో పర్యటించి ఉత్పత్తిని పరిశీలించారు. సీఎండీ బలరాం ఆదేశాల మేరకు ఉద్యోగులు నిర్దేశిత లక్ష్యాలను సాధిం చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అధికారులు సైతం నిత్యం పర్యవేక్షిస్తూ టార్గెట్‌ను చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి కృషి ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.

ఏరియాలో(గురువారం) నాటికి లక్ష్యం, చేరుకున్న ఉత్పత్తి

లక్షల టన్నుల్లో...

గని పేరు లక్ష్యం సాధించింది

ఆర్‌కె 5 2.70 2.45

ఆర్‌కె 6 1.80 1.71

ఆర్‌కె 7 3.60 2.93

ఆర్‌కె న్యూటెక్‌ 1.60 1.40

ఎస్‌ఆర్‌పి 1 1.50 1.00

ఎస్‌ఆర్‌పి 3, 3ఎ 2.80 2.03

ఇందారం 1ఎ 2.40 1.70

శ్రీరాంపూర్‌ ఓసీపీ 35 25

ఇందారం ఓసీపీ 15 11

Updated Date - Feb 15 , 2024 | 10:18 PM