Share News

ఘనంగా రాములవారి పట్టాభిషేకం

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:09 PM

మండల కేంద్రంలోని మణికంఠ అయ్యప్పస్వామి ఆలయ సముదాయంలోని కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామ నవమి మహోత్సవాలు ఐదు రోజులపాటు ఘనంగా జరిగాయి.

ఘనంగా రాములవారి పట్టాభిషేకం
ఉండవల్లి కోదండరామాలయంలో పట్టాభిషేకం చేస్తున్న అర్చకులు

స్వామి వారికి ప్రత్యేక పూజలు

ఉండవల్లి, ఏప్రిల్‌ 18 : మండల కేంద్రంలోని మణికంఠ అయ్యప్పస్వామి ఆలయ సముదాయంలోని కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామ నవమి మహోత్సవాలు ఐదు రోజులపాటు ఘనంగా జరిగాయి. చివరిరోజు గురువారం ఉదయం సేవా కాలం, శాంతిపాఠం, సంక్షిప్త రామాయణ హవనం, మహా పూర్ణాహుతి, కుంభప్రోక్షణ, మంగళాశాసనం, పండిత సన్మానం, వేదాశీర్వచనం తదితర విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం 11 గంటల సమయంలో వేదపండితుల మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల మధ్య కోదండ రాముడి పట్టాభి షేకాన్ని ఘనంగా నిర్వహించారు. ధర్మకర్తలు, దాతల సహకా రంతో దాదాపు రూ.30 లక్షల వ్యయంతో తయారు చేయించిన సప్త అశ్వమేధ రథాన్ని సాయంత్రం అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ప్రారం భించారు. అనంతరం అయ్యప్పస్వామి ఆలయం నుంచి ఊరువాకిలి వరకు నిర్వహించిన శోభాయాత్ర కనులవిందుగా జరిగింది. ఈ సందర్భంగా రథాన్ని లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. శోభయాత్రలో మండల కేంద్రానికి చెందిన చిన్నారులతో పాటు వరంగల్‌ నుంచి వచ్చిన చిన్నారులు ప్రదర్శించిన కోలాట నృత్యం అందరినీ ఆకట్టుకున్నది.

Updated Date - Apr 18 , 2024 | 11:09 PM