Share News

Samsung: సామ్‌సంగ్ నుంచి మార్కెట్లోకి కొత్త వేరియంట్‌ స్మార్ట్‌ఫోన్ ..ధర కూడా

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:20 PM

మీరు తక్కువ ధరల్లో మంచి బ్రాండ్ కల్గిన 5జీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే సామ్‌సంగ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ 5G ఫోన్‌ కొత్త వేరియంట్‌ మార్కెట్లోకి వచ్చింది. ఈ కంపెనీ మార్చిలో ప్రారంభించిన Samsung Galaxy F15 5G 8GB RAM వేరియంట్‌ను తాజాగా పరిచయం చేసింది.

Samsung: సామ్‌సంగ్ నుంచి మార్కెట్లోకి కొత్త వేరియంట్‌ స్మార్ట్‌ఫోన్ ..ధర కూడా
Samsung Launches Galaxy F15 5Gs 8gb ram

మీరు తక్కువ ధరల్లో మంచి బ్రాండ్ కల్గిన 5జీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే సామ్‌సంగ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ 5G ఫోన్‌ కొత్త వేరియంట్‌ మార్కెట్లోకి వచ్చింది. ఈ కంపెనీ మార్చిలో ప్రారంభించిన Samsung Galaxy F15 5G 8GB RAM వేరియంట్‌ను తాజాగా పరిచయం చేసింది. ఇంతకుముందు ఇది 4GB + 6GB RAM వేరియంట్లలో మాత్రమే ప్రారంభించబడింది. ఇప్పుడు ఈ ఫోన్ మూడు కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది.


ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే

  • Samsung Galaxy F15 5G 6.5 అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది

  • ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 6100+ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది

  • ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా OneUI 5.0ని కలిగి ఉంది

  • ఈ హ్యాండ్‌సెట్‌కు 6000mAh బ్యాటరీ అందించబడింది

  • ఈ స్మార్ట్‌ఫోన్ 5G, Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS, USB టైప్ సీ కనెక్టివిటీతో వస్తుంది


కొత్త వేరియంట్ 8GB RAM + 128GB నిల్వను కలిగి ఉంది. దీని ధర రూ.15,999. ఈ ఫోన్ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999, 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499గా ఉంది. అంతేకాకుండా మీరు ఈ ఫోన్‌ను ఫ్లిప్ కార్టులో బ్యాంక్ ఆఫర్‌ల ద్వారా మరింత తగ్గింపునకు పొందవచ్చు. దీంతోపాటు ఎక్సేంజ్ ఆఫర్ సౌకర్యం కూడా ఉంది.


ఇది కూడా చదవండి:

The Boring Phone: మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి ‘ది బోరింగ్ ఫోన్’..ఫీచర్లు తెలిస్తే..

Smart Phone: మీరు మీ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు.. ఇలా తెలుసుకోండి

మరిన్ని సాంకేతిక వార్తల కోసం

Updated Date - Apr 22 , 2024 | 05:57 PM