Share News

Samsung Galaxy S24 Ultra: విడుదలైన ఎస్24 అల్ట్రా.. ఖరీదు లక్షన్నర పైనే.. దీనిలో ప్రత్యేకత ఏంటంటే..

ABN , Publish Date - Jan 19 , 2024 | 08:29 AM

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తాజాగా ఎస్24 సిరీస్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రాను ఈ సందర్భంగా ఆవిష్కరించింది. గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ వేదికగా ఎస్24 సిరీస్ ఫోన్లను లాంఛ్ చేసింది.

Samsung Galaxy S24 Ultra: విడుదలైన ఎస్24 అల్ట్రా.. ఖరీదు లక్షన్నర పైనే.. దీనిలో ప్రత్యేకత ఏంటంటే..

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ (Samsung) తాజాగా ఎస్24 సిరీస్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రాను ఈ సందర్భంగా ఆవిష్కరించింది. గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ వేదికగా ఎస్24 సిరీస్ ఫోన్లను లాంఛ్ చేసింది. ఇందులో ఎస్‌24, ఎస్‌24+, ఎస్‌24 అల్ట్రా పేరిట మూడు గ్యాడ్జెట్స్ ఉన్నాయి. ఎస్ 24 ధర 79,999 నుంచి రూ.89,999 మధ్య ఉండనుంది. ఇక, ఎస్‌24+ ధర రూ.99,999 నుంచి రూ.1,09,999 మధ్య ఉండనుంది (Samsung Galaxy S24 Ultra).

ఇక, ఫ్లాగ్‌షిప్ మొబైల్ ఎస్‌24 అల్ట్రా ధర రూ.1,29,999 నుంచి రూ.1,59,999 మధ్య ఉండనుంది. కాగా, ఈ ఎస్‌24 అల్ట్రాలో ఎన్నో ఏఐ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్మార్ట్‌‌ఫోన్‌లో అల్ట్రా లైవ్ ట్రాన్స్‌లేట్ ఉంది. ఇది ఫోన్ మాట్లాడే సమయంలో కూడా రియల్ టైమ్ టూ-వే అనువాదాలను సులభతరం చేస్తుంది. అలాగే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్‌లలో కూడా అనువాదం చేసిన కంటెంట్‌ను పొందవచ్చు. ఇక కెమేరా విభాగానికి వస్తే ఎస్24 అల్ట్రాలో క్వాడ్ రేర్ కెమెరా (200ఎంపీ ప్రైమరీ, 50ఎంపీ టెలిఫొటో, 10ఎంపీ టెలిఫొటో, 12ఎంపీ అల్ట్రా వైడ్) సెటప్ ఉంటుంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12ఎంపీ ఫ్రెంట్ కెమెరా ఉంది. దీనితో 8కే రిజెల్యూషన్ క్వాలిటీ వీడియోలు రికార్డ్ చేసుకోవచ్చు.

మరో విశేషమేమిటంటే ఈ ఎస్24 సిరీస్ ఫోన్లు ఏకంగా 7 ఏళ్ల పాటు మేజర్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను 7 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందుకోనున్నాయి. ఇక, డిస్‌ప్లే విషయానికి వస్తే ఎస్24 అల్ట్రాలో 6.8 అంగుళాల క్యూహెచ్డీ+ డిస్ ప్లే ఉంది. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. అలాగే అల్ట్రాలో ఎస్ పెన్ కూడా ఉంటుంది. ఈ ఫోన్‌ను టైటానియం ఫ్రేమ్‌తో డిజైన్ చేశారు.

Updated Date - Jan 19 , 2024 | 08:52 AM