Share News

Samsung: రూ.10 వేలకే సామ్‌సంగ్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఈ ఆఫర్ చుశారా?

ABN , Publish Date - Feb 19 , 2024 | 04:00 PM

మీరు 10 వేల రూపాయల్లోపు మంచి బ్రాండ్ కల్గిన 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చుస్తున్నారా. అయితే మీరు ఈ వార్తను పూర్తిగా చదవాల్సిందే.

Samsung: రూ.10 వేలకే సామ్‌సంగ్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఈ ఆఫర్ చుశారా?

మీరు 10 వేల రూపాయల్లోపు మంచి బ్రాండ్ కల్గిన 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చుస్తున్నారా. అయితే మీరు ఈ వార్తను పూర్తిగా చదవాల్సిందే. అయితే ఏ బ్రాండ్ నుంచి 10 వేల లోపు మంచి ఫీచర్లు కల్గిన 5జీ ఫోన్ వస్తుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ సామ్‌సంగ్ నుంచి 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ సపోర్ట్‌తో 5జీ ఫోన్ ఇప్పటికే మార్కెట్లోకి వచ్చింది. దీనిపై ఆన్‌లైన్ సేల్లో 30 శాతానికిపైగా డిస్కౌంట్ ప్రకటించారు. దీని అసలు ధర ప్రస్తుతం 14 వేల ఉండగా..ఆఫర్లో 10 వేల రూపాయలకే లభిస్తుంది.


ఈ మోడల్ పేరు M13 5G కాగా ఇది 720 x 1600 పిక్సెల్‌ల HD+ రిజల్యూషన్‌, 16.55 సెంటీమీటర్లు (6.5 అంగుళాల) LCD డిస్ ప్లేతో వస్తుంది. 50MP+2MP డ్యూయల్ కెమెరా సెటప్, 11 5G బ్యాండ్‌లతో సూపర్‌ఫాస్ట్ 5G, ఆండ్రాయిడ్ 12, శక్తివంతమైన MTK D700 ఆక్టా కోర్ 2.2GHz, ఒక UI కోర్ 4 ప్రొసెసర్, డ్యుయల్ సిమ్ వంటి ఫీచర్లతో లభిస్తుంది. 5000mAH లిథియం అయాన్ బ్యాటరీ, దీనిపై ఒక సంవత్సరం వారంటీ, కొనుగోలు చేసిన తేదీ నుంచి ఇన్ బాక్స్ ఉపకరణాలతో సహా బ్యాటరీపై 6 నెలల తయారీదారు వారంటీ కలదు.

Updated Date - Feb 19 , 2024 | 04:00 PM