Share News

Samsung: రూ.18 వేలకే Galaxy A35 5జీ స్మార్ట్‌ఫోన్.. ఈ ఆఫర్ తెలుసా?

ABN , Publish Date - Mar 19 , 2024 | 04:31 PM

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ Samsung నుంచి రెండు కొత్త మోడల్స్ ఇటివల మార్కెట్లోకి వచ్చాయి. ఈ సిరీస్‌లో కంపెనీ Samsung Galaxy A35 5G, Samsung Galaxy A55 5G అనే రెండు ఫోన్‌లను ఇటివల లాంచ్ చేసింది. అయితే ప్రస్తుతం Samsung Galaxy A35 5G మోడల్ ఫోన్‌పై ఉన్న ఆఫర్, ఫీచర్ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Samsung: రూ.18 వేలకే Galaxy A35 5జీ స్మార్ట్‌ఫోన్.. ఈ ఆఫర్ తెలుసా?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ Samsung నుంచి రెండు కొత్త మోడల్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఈ సిరీస్‌లో కంపెనీ Samsung Galaxy A35 5G, Samsung Galaxy A55 5G అనే రెండు ఫోన్‌లను ఇటివల లాంచ్ చేసింది. అయితే ఈ రెండు ఫోన్‌లు రూపురేఖల్లో ఒకేలా ఉన్నా కూడా కొన్ని ఫీచర్లు, ధరలకు సంబంధించి భిన్నంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం Samsung Galaxy A35 5G మోడల్ ఫోన్‌పై ఉన్న ఆఫర్, ఫీచర్ల వివరాల గురించి ఇప్పుడు చుద్దాం.

Samsung Galaxy A35 5G స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేతో పూర్తి HD 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్ Exynos 1380 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఈ Samsung స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో లభిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో LED ఫ్లాష్‌తో మూడు కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో పాటు 8 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్లు ఉన్నాయి. ఇది కాకుండా సెల్ఫీ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 5000 mAh బ్యాటరీ, డ్యూయల్ సిమ్, UHD 4K వీడియో రిజల్యూషన్, IP67 రేటెడ్ సెక్యూరిటీ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.


ఇది ప్రస్తుతం రెండు కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 30,999 ఉండగా, 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999గా ఫ్లిప్‌కార్టులో పేర్కొన్నారు. 128GB స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.30 వేలు ఉండగా వన్ ప్లస్ లాంటి ఏదైనా స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ ద్వారా ఈ ఫోన్ రూ.18 వేలకే లభిస్తుంది. అయితే ఆయా కంపెనీ స్మార్ట్‌ఫోన్ల మోడల్ లేదా ఎక్స్చేంజ్ మోడల్‌ను బట్టి తగ్గింపు ధరలు ఉంటాయి. గరిష్టంగా రూ.27 వేల వరకు తగ్గింపును అందిస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Viral Video: పీఎస్‌ఎల్ ఫైనల్ మ్యాచ్ సమయంలో కీలక ఆటగాడి స్మోకింగ్

Updated Date - Apr 23 , 2024 | 09:15 AM