Share News

Oppo Reno 11 Pro: నేడు విడుదలైన ఒప్పో రెనో 11 Pro 5G స్మార్ట్‌ఫోన్..ప్రత్యేకతలివే

ABN , Publish Date - Jan 12 , 2024 | 05:09 PM

OPPO జనవరి 12న భారతదేశంలో రెనో 11 సిరీస్‌ను విడుదల చేసింది. వీటిలో వనిల్లా రెనో11 5G, రెనో11 5G ప్రో మోడళ్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్‌లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇక దీని ఫీచర్లు ఏంటో ఇప్పుడు చుద్దాం.

Oppo Reno 11 Pro: నేడు విడుదలైన ఒప్పో రెనో 11 Pro 5G స్మార్ట్‌ఫోన్..ప్రత్యేకతలివే

చైనీస్ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ Oppo Reno 11 5G సిరీస్‌ను ప్రారంభించింది. ఈ సిరీస్‌లో Oppo Reno 11 5G, Oppo Reno 11 Pro 5G ఉన్నాయి. ఇది Oppo Reno 10 సిరీస్ అప్‌గ్రేడ్ వెర్షన్. వీటిలో బ్యాటరీలు వరుసగా 5000mAh, 4600mAh ఉన్నాయి. ఈ రెండు ఫోన్‌లలో 256GB స్టోరేజ్, 32MP టెలిఫోటో లెన్స్, ColorOS 14.0 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఇక Reno11 Pro 5G రూ. 39,999గా ఫ్లిప్ కార్టులో ప్రకటించారు. దీనిపై రూ.5 వేల డిస్కౌంట్ కూడా ప్రకటించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, OPPO ఇ-స్టోర్, రిటైల్ అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉంటాయి.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ చూడండి: Sensex and Nifty: సరికొత్త శిఖరాలపై దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. ఒకే రోజు రూ. 2.76 లక్షల కోట్లు లాభపడ్డ ఇన్వెస్టర్లు

పెరల్ వైట్, రాక్ గ్రే కలర్ ఆప్షన్‌లలో వస్తున్న ఈ డివైజ్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. Dragontel Star 2 గ్లాస్ ప్రొటెక్షన్‌తో 3D కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తున్న ఈ ఫోన్ MediaTek Dimensity 8200 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. బ్యాటరీ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ప్రో మోడల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 50MP IMX890 ప్రధాన కెమెరా, 32MP IMX709 RGBW టెలిఫోటో సెన్సార్, 8MP IMX355 అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉన్నాయి. Oppo ప్రపంచంలోనే మొట్టమొదటి హైపర్‌టోన్ కెమెరాతో ఫోన్‌ను తీసుకువచ్చినట్లు ప్రకటించింది.

Updated Date - Jan 12 , 2024 | 05:09 PM