Share News

Nothing: నథింగ్ 2a స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఇవే ధర, ఫీచర్లు!

ABN , Publish Date - Feb 15 , 2024 | 08:53 PM

సరికొత్త మోడల్‌తో మార్కెట్లోకి ఎంట్రి ఇచ్చిన నథింగ్ ఫోన్ల గురించి మరో అప్డేట్ వచ్చింది. ప్రత్యేకంగా రూపొందించిన ఈ స్మార్ట్‌ఫోన్‌లు లండన్ ఆధారిత స్టార్టప్ ద్వారా ప్రజాదరణ పొందాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్ నథింగ్ 2a మార్చి 5న విడుదల కానుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

Nothing: నథింగ్ 2a స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఇవే ధర, ఫీచర్లు!

సరికొత్త మోడల్‌తో మార్కెట్లోకి ఎంట్రి ఇచ్చిన నథింగ్ ఫోన్ల గురించి మరో అప్డేట్ వచ్చింది. ప్రత్యేకంగా రూపొందించిన ఈ స్మార్ట్‌ఫోన్‌లు లండన్ ఆధారిత స్టార్టప్ ద్వారా ప్రజాదరణ పొందాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్ నథింగ్ 2a మార్చి 5న ఇండియాలో విడుదల కానుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కంపెనీ CEO అయిన కార్ల్ పీ ఇటీవల Q&A సెషన్‌లో వివరాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో పాటు దీని గురించి కొన్ని ఊహించిన ఫీచర్లు, ధరలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చుద్దాం.


ఈ ఫోన్ (2a) 6.7 అంగుళాల AMOLED 120Hz డిస్‌ప్లే, 33W ఛార్జింగ్‌తో 4500 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ 12GB RAM, 256GB స్టోరేజ్ సపోర్ట్ ఉంది. ఇది తెలుపు, నలుపు రెండు రంగుల వేరియంట్లలో లభించనుంది. ఇతర స్పెసిఫికేషన్‌లలో 32MP ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 14 ఆధారంగా నథింగ్ OS 2.5, USB 2.0 టైప్ సీ పోర్ట్ ఉండవచ్చు. ఇది నథింగ్ (1) కంటే మెరుగ్గా ఉంటుంది. ఇక దీని ధర నథింగ్ (2a) $400 లేదా రూ. 24,999గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Updated Date - Feb 15 , 2024 | 08:54 PM