Share News

MNP: నెంబర్ మార్చకుండా వేరే నెట్‌వర్క్‌కు మారాలనుకుంటున్నారా? జులై 1 నుంచి ట్రాయ్ కొత్త రూల్..

ABN , Publish Date - Mar 18 , 2024 | 08:32 PM

మొబైల్ నెంబర్‌ను మార్చనవసరం లేకుండా వేరే నెట్‌వర్క్‌కు మారే వెసులుబాటు కల్పించే మొబైల్ నెంబర్ పోర్టబులిటీ (MNP) విషయంలో నిబంధనలను కఠినతరం చేసేందుకు ట్రాయ్ రంగం సిద్ధం చేసింది.

MNP: నెంబర్ మార్చకుండా వేరే నెట్‌వర్క్‌కు మారాలనుకుంటున్నారా? జులై 1 నుంచి ట్రాయ్ కొత్త రూల్..

మొబైల్ నెంబర్‌ను మార్చనవసరం లేకుండా వేరే నెట్‌వర్క్‌కు మారే వెసులుబాటు కల్పించే మొబైల్ నెంబర్ పోర్టబులిటీ (MNP) విషయంలో నిబంధనలను కఠినతరం చేసేందుకు ట్రాయ్ (TRAI) రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు కొత్త నిబంధనను అమలు చేయబోతోంది. జులై 1వ తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి రాబోతోంది. స్విమ్ స్వాప్ (SIM Swap) మోసాలను అరికట్టడం కోసం ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ కొత్త నిబంధన ప్రకారం ఎవరైనా వ్యక్తి సిమ్ కార్డు మార్చుకున్నా, స్వాప్ చేసినా వారం రోజుల వరకు వేరే నెట్‌వర్క్‌కు మారేందుకు కుదరదు. వేరే నెట్‌వర్క్‌కు మారేందుకు అవసరమయ్యే యునిక్ పోర్టింగ్ కోడ్ (UPC) ను ఏడు రోజుల తర్వాతే జారీ చేస్తారు. సిమ్ కార్డులతో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలంటూ టెలికాం విభాగం చేసిన అభ్యర్థనతో ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయం వల్ల కొత్త వ్యక్తి పేరుతో అదే నెంబర్ తీసుకోవడం వేరే వాళ్లకు కుదరదు. మొబైల్ నెంబర్ పోర్టబులిటీ 2009లో అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా మన నెంబర్‌ను మార్చుకోనవసరం లేకుండా మనకు నచ్చిన నెట్‌వర్క్‌లోకి మారిపోవచ్చు.

Updated Date - Mar 18 , 2024 | 08:32 PM