Share News

Iqoo neo 9 pro: iQOO నియో 9 ప్రో లాంచ్ తేదీ ఖరారు

ABN , Publish Date - Jan 16 , 2024 | 03:07 PM

దేశీయ మార్కెట్లోకి మరో చైనీస్ స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. ఈ క్రమంలో iQOO నియో 9 ప్రో వచ్చే నెల ఫిబ్రవరి 22న దేశంలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు.

Iqoo neo 9 pro: iQOO నియో 9 ప్రో లాంచ్ తేదీ ఖరారు

దేశీయ మార్కెట్లోకి మరో చైనీస్ స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. ఈ క్రమంలో iQOO నియో 9 ప్రో వచ్చే నెల ఫిబ్రవరి 22న దేశంలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో కంపెనీ అధికారిక హ్యాండిల్లో ఈ వివరాలను షేర్ చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరి 22, 2024న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ పోస్ట్‌లో తెలిపింది. ఈ ఫోన్ అమెజాన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. అయితే ఈ మోడల్ గురించి అధికారికంగా స్పెసిఫికేషన్లను ప్రకటించనప్పటికీ లీకైన సమాచారం గురించి ఇప్పుడు చుద్దాం.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Software Engineers: 5 లక్షల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు స్పెషల్ ట్రైనింగ్..ఇందుకేనా!


iQOO Neo 9 Proలో 6.78 అంగుళాల OLED డిస్‌ప్లే, 2800 x 1260 రిజల్యూషన్, HDR 10 టెక్నాలజీతో లభించనుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌, Qualcomm Snapdragon 8 Gen 2 చిప్‌సెట్ ప్రొసెసర్, గ్రాఫిక్స్ కోసం Adreno 740 GPU వంటి ఫీచర్లు ఉన్నాయి. 16GB LPDDR5X RAM + 1 TB UFS4.0 అంతర్గత నిల్వతో రానుంది. డ్యూయల్ రియర్ కెమెరా సపోర్టుతో 50 మెగాపిక్సెల్ సోనీ వీసీఎస్ ఐఎంఎక్స్ 92 సెన్సార్, 50 మెగాపిక్సెల్ ఇతర కెమెరా రానుంది. అదే సమయంలో, సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. ఇక బ్యాటరీ పరంగా iQOO Neo 9 Pro 5160mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది.

Updated Date - Jan 16 , 2024 | 03:07 PM