Share News

iQOO Neo 7 5జీ స్మార్ట్‌ఫోన్ రూ.4,000 తగ్గింపు..త్వరపడండి

ABN , Publish Date - Jan 07 , 2024 | 03:17 PM

మీరు మంచి 5జీ స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్నారా. అయితే మీ కోసం మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. iQOO Neo7 5G ఫోన్లపై 4000 రూపాయలను తగ్గింపు ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.

iQOO Neo 7 5జీ స్మార్ట్‌ఫోన్ రూ.4,000 తగ్గింపు..త్వరపడండి

దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో పోటీ పెరిగింది. అనేక కంపెనీలు పోటీ పడి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే iQOO Neo7 5G ఫోన్ల ధరలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. అయితే iQOO నియో 9 సిరీస్ ఫోన్లను ఫిబ్రవరిలో విడుదల చేస్తున్న క్రమంలో ఈ మేరకు దానికి ముందు మోడళ్లపై డిస్కౌంట్లను ప్రకటించింది.


ఈ నేపథ్యంలో iQOO Neo7 5G 12GB RAM, 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.27,999కి తగ్గించబడింది. గతంలో దీని ధర రూ.31,999గా ఉండేది. దీని ప్రకారం చూస్తే దీని రేటు దాదాపు రూ.4,000 తగ్గింది. ఇక ఇదే మోడల్ ఫోన్ 8GB RAM, 256 GB స్టోరేజ్‌తో ఉన్న ఫోన్‌పై కూడా రూ.3000 తగ్గింపును ప్రకటించారు.


ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్ల విషయానికి వస్తే 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 1,300 nitsతో ప్రకాశంవంతంగా కనిపిస్తుంది. దీని రిజల్యూషన్ 1080 x 2400 పిక్సెల్స్ కాగా 4nm టెక్నాలజీతో పనిచేసే Mediatek డైమెన్సిటీ 8200 ప్రాసెసర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతోపాటు ఇది ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, సెల్ఫీ ప్రియుల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఆప్షన్లు ఉన్నాయి. ఇక ఈ ఫోన్ 120 వాట్ల ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీ సపోర్టుతో వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS, NFC వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

Updated Date - Jan 07 , 2024 | 03:17 PM