Share News

Jio Number: మీకు నచ్చిన జియో నెంబర్ పొందడం చాలా సులభం.. ఇలా చేయండి..

ABN , Publish Date - Jan 08 , 2024 | 06:23 PM

మనకు నచ్చిన మొబైల్ నెంబర్ దక్కడం అనేది ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది. ముఖ్యంగా ఫ్యాన్సీ నెంబర్ కోసం ఎంతో అన్వేషణ సాగించాల్సి వచ్చేది. అయితే జియో ఆ కష్టాలకు స్వస్తి పలికింది. జియో పోస్ట్‌పెయిడ్ లేదా ప్రీ పెయిడ్ వినియోగదారులు తమకు నచ్చిన నెంబర్లను ఎంచుకునే వీలుంది.

Jio Number: మీకు నచ్చిన జియో నెంబర్ పొందడం చాలా సులభం.. ఇలా చేయండి..

మనకు నచ్చిన మొబైల్ నెంబర్ (Mobile Number) దక్కడం అనేది ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది. ముఖ్యంగా ఫ్యాన్సీ నెంబర్ (Jio Fancy Number) కోసం ఎంతో అన్వేషణ సాగించాల్సి వచ్చేది. అయితే జియో ఆ కష్టాలకు స్వస్తి పలికింది. జియో పోస్ట్‌పెయిడ్ లేదా ప్రీ పెయిడ్ వినియోగదారులు తమకు నచ్చిన నెంబర్లను ఎంచుకునే వీలుంది. మొబైల్ నెంబర్‌లో చివరి 4 నుంచి 6 డిజిట్స్ మార్చుకునే అవకాశం జియో కల్పించింది. జియో కల్పించిన ఈ అవకాశంతో మీ లక్కీ నెంబర్, బర్త్ డేట్ మొదలైన వాటితో మీ మొబైల్ నెంబర్ సెట్ చేసుకోవచ్చు.

మీకు నచ్చిన జియో నెంబర్ ఎంచుకోవడానికి ఇలా చేయండి..

1)మీ మొబైల్‌లో jio.com లేదా MyJio appలో లాగిన్ కావాలి. అందులోని ``సెల్ఫ్ కేర్ సెక్షన్``లోనికి వెళ్లాలి.

2)jio.comలో అయితే ``ఛాయిస్ నెంబర్ సెక్షన్``, యాప్‌లో అయితే ``ఛాయిస్ నెంబర్`` ఆప్షన్లపై క్లిక్ చేయాలి.

3)మొబైల్ నెంబర్‌లోని చివరి 4 లేదా 6 నెంబర్లను మీరు కోరుకున్నట్టుగా మార్చుకోవాలి.

4)పేమెంట్ సెక్షన్‌లోకి వెళ్లి రూ. 499 చెల్లించాలి.

5) పేమెంట్ పూర్తయిన 24 గంటల్లో మీరు ఎంచుకున్న జియో నెంబర్ యాక్టివేట్ అవుతుంది.

Updated Date - Jan 08 , 2024 | 06:23 PM