Share News

ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయండి

ABN , Publish Date - May 24 , 2024 | 12:18 AM

ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం గంగాధర మార్కెట్‌ యార్డు, లక్ష్మీదేవిపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయండి

గంగాధర, మే 23: ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం గంగాధర మార్కెట్‌ యార్డు, లక్ష్మీదేవిపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈనెల చివరి వరకు జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాలను పూర్తి చేయాలన్నారు. ఐకేపీ కేంద్రాల్లో కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా కొనుగోళ్లు మందకొడిగా సాగుతుంటే వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం అమ్మిన రైతులకు ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తున్నామని చెప్పారు. జిల్లాలో రైతులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా చూస్తున్నామని తెలిపారు. అధికారులు పకడ్బందీగా వ్యవహరిస్తూ ముందుకు సాగాలని సూచించారు. అంతకుముందు మండలంలోని ఆచంపల్లి, రంగరావుపల్లి పాఠశాలల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు పనులు పూర్తి చేయాలన్నారు. కరెంటు, సిమెంట్‌ పనులు జూన్‌5లోపు పూర్తి చేస్తే కలర్లు వేయడానికి అవకాశముంటుందన్నారు. ఆమె వెంట అదనపు కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ రజనీకాంత్‌, ఇన్‌చార్జి డీసీఎస్‌వో సురేష్‌రెడ్డి, ఇన్‌చార్జి తహసీల్దార్‌ వినయ్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - May 24 , 2024 | 12:18 AM