Share News

iphone: రూ.8 వేలకే ఐఫోన్ 14.. అదిరిపోయే ఆఫర్!

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:13 PM

ఐఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులకు మంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఆపిల్ ఐఫోన్ 14పై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపును అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆఫర్ల ద్వారా కేవలం 8 వేల రూపాయలకే లభిస్తుంది. ఆ విరాలేంటో ఇక్కడ చుద్దాం.

iphone: రూ.8 వేలకే ఐఫోన్ 14.. అదిరిపోయే ఆఫర్!

ఐఫోన్(iphone) కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులకు మంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఆపిల్(apple) ఐఫోన్ 14పై(iphone 14) ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపును అందిస్తుంది. ఇటివల ఫ్లిప్‌కార్ట్ అమ్మకాలలో అత్యధింగా అమ్ముడైన ఆపిల్ మోడల్ ఫోన్ కూడా ఇదే కావడం విశేషం. ఎంత తగ్గింపును అందిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ఫోన్ 48,000 రూపాయల తగ్గింపు తర్వాత రూ.8999కు లభించనుంది. అయితే దీని అసలు ధర రూ.69,900 కాగా, ఈ ఆఫర్ ఎలా వర్తిస్తుందో ఇప్పుడు చుద్దాం.


Apple iPhone 14 స్టోర్ రేట్ నుంచి రూ.12,901 తగ్గింపు తర్వాత ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.56,999గా సేల్ చేస్తున్నారు. దీంతోపాటు మీ పాత ఐఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు రూ.48 వేల వరకు తగ్గింపును ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ తగ్గింపు తర్వాత ఐఫోన్ చివరగా రూ.8999కి వినియోగదారులకు లభించనుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

iPhone 14 6.7 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉండి, A15 బయోనిక్ చిప్‌సెట్‌, 6 కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. డ్యూయల్ కెమెరా సెటప్, 12MP ప్రైమరీ కెమెరా + 12MP అల్ట్రా వైడ్ కెమెరా, 5జీ, 4జీ నెట్ వర్క్ సపోర్ట్, ఫేస్ ID, బారోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్‌ వంటి ఫీచర్లు కలవు. ఇది శాటిలైట్ కనెక్టివిటీ ద్వారా ఎమర్జెన్సీ SOSని కూడా కల్గి ఉంది. 128 GB వరకు స్టోరేజ్ సౌకర్యం కలదు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Jio Recharge Free: ముకేశ్ బర్త్ డే, అంబానీ కుమారుడి పెళ్లి నేపథ్యంలో జియో రీఛార్జ్ ఫ్రీ..క్లారిటీ

Updated Date - Apr 23 , 2024 | 09:51 AM