Share News

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు అదిరిపోయే వార్త.. ఆ ప్లాన్ వాలిడిటీ 14 రోజులకు పెంపు

ABN , Publish Date - Jun 09 , 2024 | 05:37 PM

భారత్‌లో ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఎయిర్‌టెల్(Airtel) ఒకటి. ఇది సరసమైన ధరలకే అత్యత్తమైన ప్లాన్‌లను అందిస్తోంది. అయితే తాజాగా ఎయిర్ టెల్ ఒక ప్లాన్ వాలిడిటీ గడువును పెంచింది.

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు అదిరిపోయే వార్త.. ఆ ప్లాన్ వాలిడిటీ 14 రోజులకు పెంపు

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఎయిర్‌టెల్(Airtel) ఒకటి. ఇది సరసమైన ధరలకే అత్యత్తమైన ప్లాన్‌లను అందిస్తోంది. అయితే తాజాగా ఎయిర్ టెల్ ఒక ప్లాన్ వాలిడిటీ గడువును పెంచింది. అత్యంత ప్రజాదరణ కలిగిన ఈ ప్లాన్ వాలిడిటీ పొడగించడం ఎయిర్ టెల్ యూజర్లకు నిజంగా శుభ వార్తే చెప్పుకోవచ్చు. రూ.395 ప్లాన్ గడువును ఎయిర్ టెల్ పొడగించింది.

ఇది ఇప్పటివరకు వినియోగదారులకు 56 రోజుల వాలిడిటీని అందించింది. అయితే తాజాగా ఈ గడువును 56 నుండి 70 రోజులకు పెంచింది. అంటే అదే ధరతో కస్టమర్లు మరో 14 రోజులపాటు ప్లాన్‌ని వినియోగించుకోవచ్చు. ఈ పొడిగింపుతో ఎయిర్‌టెల్ వినియోగదారులు ఎక్కువ కాలం పాటు ఉచిత కాలింగ్, అపరిమిత డేటాను ఆస్వాదించగలరు.

రూ. 395 ప్లాన్ ప్రయోజనాలు

  • రూ. 395 విలువైన ఈ ప్లాన్ ఎయిర్‌టెల్ అపరిమిత ప్లాన్‌ల విభాగంలో ఉంది

  • దీనితో ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత అపరిమిత కాలింగ్‌ను అందిస్తుంది.

  • 70 రోజులపాటు చెల్లుబాటు అవుతుంది.

  • 70 రోజుల వ్యవధిలో కేవలం 6GB డేటాను మాత్రమే అందిస్తుంది.

  • 600 SMSలను అందిస్తుంది.


అదనపు ప్రయోజనాలు

  • రూ.395 ప్లాన్ సబ్‌స్క్రైబర్‌లు ఆరోగ్య సేవా వేదిక అయిన అపోలో 24|7 సర్కిల్‌కి యాక్సెస్ పొందుతారు.

  • ప్లాన్‌లో ఉచిత హెలోట్యూన్‌లు కూడా ఉన్నాయి.

  • ఎయిర్‌టెల్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ అయిన వింక్ మ్యూజిక్‌కి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో ప్లాన్ వస్తుంది.

Updated Date - Jun 09 , 2024 | 05:37 PM