Share News

India vs Aus: గబ్బా టెస్ట్ ``డ్రా`` గా ముగిస్తే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతేనా?

ABN , Publish Date - Dec 14 , 2024 | 07:17 PM

టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాతో ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి తీరాలి. కాబట్టి గబ్బా టెస్టులో గెలుపు టీమిండియాకు అనివార్యం. గబ్బా టెస్టు వర్షం కారణంగా డ్రా అయితే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలపై ప్రభావం చూపుతుంది.

India vs Aus: గబ్బా టెస్ట్ ``డ్రా`` గా ముగిస్తే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతేనా?
Ind vs Aus Test Series

భారత్, ఆస్ట్రేలియా (Ind vs Aus Test Series) మధ్య బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా శనివారం (డిసెంబర్ 14) మూడో టెస్టు మ్యాచ్ (Gabba Test) ప్రారంభమైంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే అనుకున్నట్టుగానే ఈ మ్యాచ్‌కు వరుణుడు (Rain) అంతరాయం కలిగించాడు. మొదటి రోజు కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. ఆస్ట్రేలియా జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 28 పరుగులు చేసింది. వర్షం ఆగకపోవడంతో తొలి రోజు ఆటను అంపైర్లు రద్దు చేశారు. మిగిలిన నాలుగు రోజులూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అప్‌‌డేట్ ఇవ్వడంతో టీమిండియా ఇబ్బందుల్లో పడింది (WTC final chances).


టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాతో ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి తీరాలి. కాబట్టి గబ్బా టెస్టులో గెలుపు టీమిండియాకు అనివార్యం. గబ్బా టెస్టు వర్షం కారణంగా డ్రా అయితే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలపై ప్రభావం చూపుతుంది. ఈ టెస్టు డ్రా అయితే ఆస్ట్రేలియా విజయాల శాతం 58.89 కాగా, భారత్ విజయాల శాతం 55.88గా ఉంటుంది. అంటే డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ 3వ స్థానంలోనూ, ఆస్ట్రేలియా 2వ స్థానంలోనూ కొనసాగుతాయి. దక్షిణాఫ్రికా యథావిధిగా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది.


గబ్బా టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఓటమి పాలైతే టీమిండియా రెండో స్థానానికి ఎగబాకుతుంది. ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోతుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయినా, డ్రా అయినా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారతాయి. ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా గెలిచినా ఫైనల్ అవకాశాలు గ్యారెంటీ అని మాత్రం చెప్పలేదు. ఈ నేపథ్యంలో టీమిండియాపై వరుణుడు కరుణ చూపిస్తాడేమో వేచి చూడాల్సిందే.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 14 , 2024 | 07:17 PM