Share News

BCCI: ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లకు షాక్.. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించిన బీసీసీఐ!

ABN , Publish Date - Feb 28 , 2024 | 06:57 PM

యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లకు బీసీసీఐ షాకిచ్చింది. రంజీలు ఆడమని ఎంత చెప్పినా వినకుండా నిర్లక్ష్యంతో వ్యవహరించినందుకు వీరిద్దరికీ తనదైన శైలిలో గుణపాఠం చెప్పింది.

BCCI: ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లకు షాక్.. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించిన బీసీసీఐ!

యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్ (Ishan Kishan), శ్రేయాస్ అయ్యర్‌ (Shreyas Iyer)లకు బీసీసీఐ షాకిచ్చింది. రంజీలు ఆడమని ఎంత చెప్పినా వినకుండా నిర్లక్ష్యంతో వ్యవహరించినందుకు వీరిద్దరికీ తనదైన శైలిలో గుణపాఠం చెప్పింది. ఇద్దరినీ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ (BCCI) తొలగించింది. 2023-24 సీజన్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆటగాళ్ల జాబితాను తాజాగా బీసీసీఐ ప్రకటించింది. ఆ జాబితాలో ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌ల పేర్లు గల్లంతయ్యాయి. ఈ కాంట్రాక్ట్ 2023 అక్టోబర్ 1 నుంచి, 2024 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది.

తాజాగా బీసీసీఐ ప్రకటించిన జాబితాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, రవీంద్ర జడేజా ఏ ప్లస్ విభాగంలో తమ స్థానాలను నిలుపుకున్నారు. వరుస డబుల్ సెంచరీలతో సత్తా చాటిన యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (yashasvi jaiswal) నేరుగా బి కేటగిరీ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ ఏ కేటగిరీలోకి ప్రవేశించారు. అలాగే కొంత కాలంగా జట్టుతో లేకపోయినప్పటికీ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఏ కేటగిరీలో స్థానం దక్కించుకున్నాడు.

బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ వివరాలు..

ఏ ప్లస్ కేటగిరి: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా

ఏ కేటగిరి: అశ్విన్, షమీ, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, సిరాజ్

బి కేటగిరి: సూర్యకుమార్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్

సి కేటగిరి: తిలక్ వర్మ, రింకూ సింగ్, రతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, రజత్ పాటిదార్

Updated Date - Feb 28 , 2024 | 06:57 PM