Share News

Rohit Sharma: రోహిత్ ఇంగ్లీష్ విని నవ్వుకునే వాళ్లం.. అతడిని ప్రపంచకప్‌తో చూడాలనుంది.. యువరాజ్ కామెంట్స్!

ABN , Publish Date - May 07 , 2024 | 03:59 PM

వచ్చే నెలలో జరగబోతున్న టీ20 ప్రపంచకప్‌ ఆడే భారత జట్టులో రోహిత్ శర్మ ఉండడం ఎంతో కీలకమని, అతడు తెలివైన కెప్టెన్ అని టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసించాడు. యువరాజ్, రోహిత్ కలిసి 2007 టీ20 ప్రపంచకప్ ఆడారు.

Rohit Sharma: రోహిత్ ఇంగ్లీష్ విని నవ్వుకునే వాళ్లం.. అతడిని ప్రపంచకప్‌తో చూడాలనుంది.. యువరాజ్ కామెంట్స్!
Yuvraj Singh, Rohit Sharma

వచ్చే నెలలో జరగబోతున్న టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup) ఆడే భారత జట్టులో రోహిత్ శర్మ (Rohit Sharma) ఉండడం ఎంతో కీలకమని, అతడు తెలివైన కెప్టెన్ అని టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ప్రశంసించాడు. యువరాజ్, రోహిత్ కలిసి 2007 టీ20 ప్రపంచకప్ ఆడారు. అప్పట్నుంచి ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ గురించి యువరాజ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.


``రోహిత్ చాలా ఫన్నీగా ఉంటాడు. ముంబైలోని బోరివాలి ప్రాంతం నుంచి వచ్చిన రోహిత్ ఇంగ్లీష్ విని నవ్వుకునేవాళ్లం. ఎప్పుడూ ఏడిపించేవాళ్లం. కానీ, అతడి హృదయం చాలా గొప్పది. అతడు మరింత విజయవంతం కావాలి. అతడు కెప్టెన్‌గా ఐదు ఐపీఎల్ టైటిళ్లు సాధించాడు. 2023 ప్రపంచకప్‌లో టీమిండియా గొప్పగా ఆడి ఫైనల్ చేరింది. ఎంతో సాధించినా అతడి వ్యక్తిత్వంలో ఏ మాత్రం మార్పు లేదు. కెరీర్ తొలి నాళ్లలో ఎలా ఉన్నాడో, ఇప్పటికీ అలాగే ఉన్నాడు. అదే రోహిత్ శర్మలోని గొప్పదనం`` అని యువీ కామెంట్స్ చేశాడు.


సహచర ఆటగాళ్లతో ఎప్పుడూ సరదాగా ఉంటూనే, స్ఫూర్తి నింపే రోహిత్ లాంటి నాయకుడు భారత్‌కు ఎంతో అవసరమని, రోహిత్‌ను టీ20 ప్రపంచకప్‌తో చూడాలని ఉందని అన్నాడు. కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్ అందుకునే అర్హత రోహిత్‌కు ఉందని అన్నాడు. యువరాజ్ 2019లో చివరి ఐపీఎల్ ఆడాడు. ఆ సీజన్‌లో ముంబై తరఫున రోహిత్ శర్మ సారథ్యంలో ఆడి రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఇవి కూడా చదవండి..

Rohit Sharma: రోహిత్ శర్మకు ఏమైంది.. అందుకు కారణమేంటి?


Virat Kohli: ``మేం కూడా ఎంతో కొంత క్రికెట్ ఆడాం.. ఎలా మాట్లాడాలో మాకు తెలుసు``.. కోహ్లీ వ్యాఖ్యలకు గవాస్కర్ కౌంటర్!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 07 , 2024 | 03:59 PM