Share News

Malaysia Masters 2024: మలేసియా ఓపెన్‌లో ఫైనల్ చేరిన పీవీ సింధు

ABN , Publish Date - May 25 , 2024 | 06:39 PM

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మలేసియా ఓపెన్ -2024లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన క్రీడాకారిణి బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్‌పై ఘన విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.

 Malaysia Masters 2024: మలేసియా ఓపెన్‌లో ఫైనల్ చేరిన పీవీ సింధు

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మలేసియా ఓపెన్ -2024లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన క్రీడాకారిణి బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్‌పై ఘన విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. గత రెండేళ్లలో ఎలాంటి టైటిల్స్ గెలవని పీవీ సింధు ఐదో సీడ్‌గా మలేసియా టోర్నీలో అడుగుపెట్టింది. ప్రపంచ 20వ ర్యాంకర్ బుసానన్‌పై సింధు దాదాపు 88 నిమిషాలపాటు పోరాడి విజయం సాధించింది. 13-21, 21-16, 21-12 తేడాతో విజయం సాధించింది. కాగా బుసానన్‌పై సింధూకి ఇది 18వ విజయం. 2019 హాంకాంగ్ ఓపెన్‌లో ఒక్కసారి మాత్రమే సింధుపై బుసానన్ విజయం సాధించింది.


కాగా సింధు 2022 సింగపూర్ ఓపెన్‌ను గెలుచుకుంది. గతేడాది మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్‌లో ఆమె రన్నరప్‌గా నిలిచింది. కాగా మరో రెండు రోజుల్లో జరగనున్న మలేసియా ఓపెన్-2024 ఫైనల్ మ్యాచ్‌లో చైనా క్రీడాకారణి వాంగ్ జీ యితో సింధు తలపడనుంది. కాగా మరో రెండు నెలల్లో షురూ కాబోతున్న పారిస్ ఒలింపిక్స్‌లో పతకం గెలవాలని సింధూ పట్టుదలగా ఉంది. కాగా సింధు ప్రస్తుతం ప్రపంచ 15వ ర్యాంకర్‌‌గా ఉంది.

Updated Date - May 25 , 2024 | 06:39 PM