Share News

Dhoni: ధోనీనే రూ.15 కోట్లకు మోసం చేసిన కేటుగాళ్లు..కోర్టుకు చేరిన ధోని

ABN , Publish Date - Jan 05 , 2024 | 05:19 PM

స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ(Dhoni) కూడా కోట్ల రూపాయలు మోసపోయారు. అవును మీరు విన్నది నిజమే. తాజాగా ఇద్దరు రూ.15 కోట్ల మేర తనను మోసం చేశారని ధోనీ ఏకంగా కోర్టులో కేసు వేశారు.

Dhoni: ధోనీనే రూ.15 కోట్లకు మోసం చేసిన కేటుగాళ్లు..కోర్టుకు చేరిన ధోని

మూడు ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ(Dhoni)నే పలువురు కేటుగాళ్లు పెద్ద ఎత్తున మోసం చేశారు. అతని పాత సహచరులు ఈ మోసానికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఆ క్రమంలో ధోనీకి ఏకంగా 15 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. అయితే ఓ క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు 2017లో ధోనీతో దివాకర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే దివాకర్ అగ్రిమెంట్ నిబంధనలను పాటించలేకపోయారు. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం ఆర్కా స్పోర్ట్స్ ఫ్రాంచైజీ రుసుమును చెల్లించి లాభాలను పంచుకుంటామని చెప్పాడు. కానీ అది జరగలేదు. ఈ ఒప్పందాన్ని కొనసాగించేందుకు ధోనీ వైపు నుంచి చాలా ప్రయత్నాలు జరిగాయి. అయితే ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలు, షరతులను ఆర్కా స్పోర్ట్స్ ఫ్రాంచైజీ విస్మరించింది. ఈ కారణంగా, ధోనీ ఆగస్ట్ 15, 2021న ఆర్కా స్పోర్ట్స్‌కి ఇచ్చిన అధికార లేఖను రద్దు చేసి, అనేక లీగల్ నోటీసులు పంపాడు. కానీ ప్రయోజనం లేకపోయింది.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ ఆసియా అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ!

ఈ క్రమంలో ధోనీ ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌కు చెందిన మిహిర్ దివాకర్, సౌమ్య బిస్వాస్‌లపై రాంచీ కోర్టు(ranchi court)లో కేసు వేశారు. ప్రపంచ స్థాయి క్రికెట్ అకాడమీని స్థాపించేందుకు 2017లో ధోనీతో దివాకర్ ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే 15 కోట్ల మేర మోసం చేశాడని ధోనీ ఆరోపించారు. అయితే ఎంఎస్ ధోని ఇటీవల తన నూతన సంవత్సర వేడుకలను దుబాయ్‌లో గడిపిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. స్వదేశానికి వచ్చి రాగానే వారిపై ఫిర్యాదు చేశారు. మరోవైపు ధోనీ మోస పోవడం పట్ల పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ధోనీ నమ్మిన వారు చీట్ చేశారని పలువురు అంటుండగా..దీనీనే బోల్తా కొట్టించారని ఇంకొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - Jan 05 , 2024 | 05:19 PM