Share News

Sindhu : విజయం వాకిట బోల్తా

ABN , Publish Date - May 27 , 2024 | 04:38 AM

దాదాపు ఏడాది తర్వాత ఒక ప్రధాన టోర్నీ ఫైనల్‌.. 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌ తర్వాత టైటిల్‌ గెలిచింది లేదు.. మరికొద్ది రోజుల్లో ఒలింపిక్స్‌.. ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్‌

Sindhu : విజయం వాకిట బోల్తా

మలేసియా మాస్టర్స్‌లో సింధు రన్నరప్‌తో సరి

కౌలాలంపూర్‌: దాదాపు ఏడాది తర్వాత ఒక ప్రధాన టోర్నీ ఫైనల్‌.. 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌ తర్వాత టైటిల్‌ గెలిచింది లేదు.. మరికొద్ది రోజుల్లో ఒలింపిక్స్‌.. ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్‌ క్వీన్‌ పీవీ సింధు మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 సిరీ్‌సలో ఫైనల్‌ చేరడంతో అందరి దృష్టి ఒక్కసారిగా ఆమె పైకి మళ్లింది. ఈ కీలకపోరులో ఆరంభం నుంచి అంచనాలకు తగ్గట్టుగానే ఆడిన సింధు చివర్లో చేసిన అనవరస తప్పిదాల కారణంగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అందినట్టే అంది, టైటిల్‌ చేజారింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన సింగిల్స్‌ ఫైనల్‌ పోరులో ప్రపంచ 15వ ర్యాంకర్‌ సింధు 21-16, 5-21, 16-21తో ఏడో ర్యాంకర్‌ వాంగ్‌ జి యి (చైనా) చేతిలో పోరాడి ఓడింది.

Updated Date - May 27 , 2024 | 04:38 AM