Share News

Jasprit Bumrah: 90 ఏళ్ల రికార్డు బ్రేక్.. వైజాగ్ టెస్ట్ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన బుమ్రా..!

ABN , Publish Date - Feb 05 , 2024 | 07:21 PM

తన సంచలన బౌలింగ్‌తో 90 ఏళ్ల నాటి రికార్డును బుమ్రా బద్దలుగొట్టాడు. 1934లో చెన్నైలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్ అమర్ సింగ్ క్రియేట్ చేసిన రికార్డును బ్రేక్ చేశాడు.

Jasprit Bumrah: 90 ఏళ్ల రికార్డు బ్రేక్..  వైజాగ్ టెస్ట్ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన బుమ్రా..!

ఇంగ్లండ్‌తో వైజాగ్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో (India vs England) టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. భారత బౌలర్లు చెలరేగడంతో టీమిండియా మరో రోజు మిగిలి ఉండగానే గెలుపు జెండా ఎగురవేసింది (Team India Victory). ఈ మ్యాచ్‌లో 9 వికెట్లతో జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు. ``ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్``గా నిలిచాడు.

వైజాగ్ టెస్టులో బుమ్రా త‌న కెరీర్‌లో రెండో అత్యుత్త‌మ‌ టెస్టు గ‌ణాంకాల‌ (9/91)ను న‌మోదుచేశాడు. 2018లో ఆసీస్‌పై 86 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టడం బుమ్రా కెరీర్ బెస్ట్. తాజాగా తన సంచలన బౌలింగ్‌తో 90 ఏళ్ల నాటి రికార్డును బుమ్రా బద్దలుగొట్టాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్‌లో 9 వికెట్లు పడగొట్టిన ఇండియన్ పేసర్‌గా నిలిచాడు. 1934లో చెన్నైలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్ అమర్ సింగ్ 8 వికెట్లు పడగొట్టాడు (Jasprit Bumrah Record).

1934 నుంచి ఇప్పటివరకు అమర్ సింగ్‌దే బెస్ట్ పేస్ బౌలింగ్ రికార్డుగా ఉంది. తాజా మ్యాచ్‌లో బుమ్రా.. అమర్ సింగ్‌ను అధిగమించాడు. అలాగే చేతన్ శర్మ (10/188) తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో ఉత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారతీయ సీమర్‌గా బుమ్రా నిలిచాడు.

Updated Date - Feb 05 , 2024 | 07:21 PM