Share News

KKR vs SRH-Qualifier 1: ఆరంభంలోనే సన్‌రైజర్స్‌కు దెబ్బ మీద దెబ్బ

ABN , Publish Date - May 21 , 2024 | 07:56 PM

అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ జట్ల మధ్య క్వాలిఫయర్-1 మ్యా్చ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆరంభంలో రెండు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. భయంకరమైన ఫామ్‌లో ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపరిచారు.

KKR vs SRH-Qualifier 1: ఆరంభంలోనే సన్‌రైజర్స్‌కు దెబ్బ మీద దెబ్బ

అహ్మదాబాద్: అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ జట్ల మధ్య క్వాలిఫయర్-1 మ్యా్చ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆరంభంలో రెండు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. భయంకరమైన ఫామ్‌లో ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. ట్రావిస్‌ డకౌట్ అయ్యాడు. కోల్‌కతా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పరుగుల ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్‌కు మరుసటి ఓవర్‌లో మరో దెబ్బ తగిలింది. యువ సంచలన అభిషేక్ శర్మ వ్యక్తిగత స్కోరు 3 పరుగుల వద్ద వైభవ్ అరోరా బౌలింగ్‌లో రస్సెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. నాలుగు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 37/2గా ఉంది. ప్రస్తుతం క్రీజులో నితీశ్ రెడ్డి (8), రాహుల్ త్రిపాఠి (22) ఉన్నారు.

Updated Date - May 21 , 2024 | 07:57 PM