Share News

DC vs LSG: టాస్ గెలిచిన లక్నో.. ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్

ABN , Publish Date - May 14 , 2024 | 07:11 PM

ఐపీఎల్-2024లో భాగంగా.. మంగళవారం సాయంత్రం ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో...

DC vs LSG: టాస్ గెలిచిన లక్నో.. ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్

ఐపీఎల్-2024లో భాగంగా.. మంగళవారం సాయంత్రం ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో.. ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ ఐపీఎల్‌లో ఢిల్లీకి ఇది చివరి మ్యాచ్. ప్రస్తుతం అది పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉండటంతో పాటు నెట్ రన్‌రేట్ మైనస్‌లో ఉంది కాబట్టి.. టాప్-4లో స్థానం సంపాదించడం అనేది అసాధ్యం. అంటే.. ఈ మ్యాచ్‌లో ఎలాంటి ఫలితం నమోదైనా, దాని ప్రభావం ఏమీ ఉండదు. ఓడినా, గెలిచినా.. ఢిల్లీ జట్టు చివరికి ఇంటిదారి పట్టాల్సిందే.


అయితే.. లక్నోకి మాత్రం ఈ మ్యాచ్ ఎంతో కీలకమైంది. లక్నోకి ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఢిల్లీతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలిస్తే, దాని ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగానే ఉంటాయి. ఆ తర్వాత ముంబైతో జరిగే చివర్ మ్యాచ్‌లోనూ సత్తా చాటగలిగితే, టాప్-4లో చేరే అవకాశం ఉంటుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందితే.. నెట్ రన్‌రేట్ మెరుగుపడటంతో పాటు 16 పాయింట్లు ఖాతాలో చేరుతాయి కాబట్టి.. ప్లేఆఫ్స్‌కు లక్నో వెళ్లడాన్ని ఎవ్వరూ ఆపలేరు. అలా కాకుండా ఢిల్లీ చేతిలో ఓడిపోతే మాత్రం.. లక్నో కూడా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. మరి.. ఢిల్లీపై సత్తా చాటి తన ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంటుందా? లేదా అనేది చూడాలి.

కాగా.. ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ఢిల్లీ, లక్నో మధ్య మొత్తం నాలుగు మ్యాచ్‌లో జరిగాయి. ఈ నాలుగింటిలో లక్నో మూడు విజయాలు సాధించగా, ఢిల్లీ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే నెగ్గింది. ఈ లెక్కన.. ఇరు జట్ల మధ్య పోరులో లక్నోదే పైచేయి ఉంది. అదే ఆధిపత్యాన్ని ఈ మ్యాచ్‌లోనూ చెలాయిస్తే.. లక్నో తన టాప్-4 ఆశల్ని సజీవంగానే ఉంచుకోవచ్చు. లేకపోతే.. ఢిల్లీతో పాటు అది కూడా ఇంటిదారే పట్టాల్సి ఉంటుంది. చూద్దాం.. ఈ మ్యాచ్‌లో ఎలాంటి ఫలితాలు నమోదవుతాయో!

Updated Date - May 14 , 2024 | 08:40 PM