Share News

DC vs LSG: ఢిల్లీ బ్యాటర్ల వీరవిహారం.. లక్నో ముందు భారీ లక్ష్యం

ABN , Publish Date - May 14 , 2024 | 09:37 PM

అరుణ్ జైట్లీ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు వీరవిహారం సృష్టించారు. ఓపెనర్ మినహాయిస్తే మిగతా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో..

DC vs LSG: ఢిల్లీ బ్యాటర్ల వీరవిహారం.. లక్నో ముందు భారీ లక్ష్యం

అరుణ్ జైట్లీ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు వీరవిహారం సృష్టించారు. ఓపెనర్ మినహాయిస్తే మిగతా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఢిల్లీ జట్టు 208 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్ (58), ట్రిస్టన్ స్టబ్స్ (57 నాటౌట్) అర్థశతకాలతో ఊచకోత కోయడంతో పాటు షాయ్ హోప్ (38), కెప్టెన్ రిషభ్ పంత్ (33) మెరుగ్గా రాణించడంతో.. ఢిల్లీ జట్టు అంత భారీ స్కోరు చేసి, లక్నోకి 209 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చివర్లో అక్షర్ పటేల్ (14) సైతం తనవంతు సహకారం అందించాడు.


తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టుకి మొదట్లోనే గట్టి దెబ్బ తగిలింది. ఆ జట్టులో విధ్వంసకర బ్యాటర్ అయిన జేక్ ఫ్రేసర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే.. అతనితో పాటు ఓపెనింగ్ చేసిన అభిషేక్ పోరెల్ మాత్రం తాండవం చేశాడు. చూడ్డానికి సన్నగా ఉన్నా.. భారీ షాట్లతో ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతనితో పాటు వన్ డౌన్‌లో వచ్చిన షామ్ హోప్ సైతం.. క్రీజులో ఉన్నంతవరకూ రప్ఫాడించేశాడు. వీళ్లిద్దరు రెండో వికెట్‌కి ఏకంగా 92 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి, తమ జట్టుకి మంచి మైలేజ్ ఇచ్చారు. ఈ ఇద్దరి తర్వాత వచ్చిన పంత్, స్టబ్స్ కూడా చితక్కొట్టేశారు.

ముఖ్యంగా.. స్టబ్స్ మొదట్లో నిదానంగా ఇన్నింగ్స్ ఆరంభించినా, ఆ తర్వాత తన తడాఖా చూపించాడు. ఓవర్లు ముగుస్తున్నకొద్దీ అతనిలో ఏదో ఎనర్జీ తన్నుకొచ్చినట్టు వీరవిహారం చేశాడు. 25 బంతుల్లోనే 57 పరుగులు చేశాడంటే.. ఎలా విధ్వంసం సృష్టించాడో మీరే అర్థం చేసుకోండి. అటు.. అక్షర్ కూడా తనవంతు సహకారం అందించడంలో సక్సె్స్ అయ్యాడు. ఫలితంగా.. ఢిల్లీ 208 పరుగుల భారీ స్కోరు చేసింది. మరి.. ఢిల్లీ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని లక్నో ఛేధిస్తుందా? తన ప్లేఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంటుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

Updated Date - May 14 , 2024 | 09:37 PM