Share News

Zomato: జొమాటో చేస్తున్నారా.. మీకొక గుడ్ న్యూస్.. ఇక ఆ బాధ ఉండదు

ABN , Publish Date - Mar 09 , 2024 | 04:18 PM

జొమాటో(Zomato) ఫుడ్ డెలివరీ చేసే మహిళలకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. నిత్యం డ్యూటీలు చేసే మహిళలకు ఇకపై టీషర్ట్ తప్పనుంది. జొమాటో డెలివరీ మహిళలు టీషర్ట్ ధరించి తిరగడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ విషయమై కంపెనీకి ఎన్నో ఫిర్యాదులు వెళ్లాయి.

Zomato: జొమాటో చేస్తున్నారా.. మీకొక గుడ్ న్యూస్.. ఇక ఆ బాధ ఉండదు

ఢిల్లీ: జొమాటో(Zomato) ఫుడ్ డెలివరీ చేసే మహిళలకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. నిత్యం డ్యూటీలు చేసే మహిళలకు ఇకపై టీషర్ట్ తప్పనుంది. జొమాటో డెలివరీ మహిళలు టీషర్ట్ ధరించి తిరగడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ విషయమై కంపెనీకి ఎన్నో ఫిర్యాదులు వెళ్లాయి.

అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా జొమాటో ఫుడ్ డెలివరీ మహిళల కోసం సరికొత్త డ్రెసింగ్ కోడ్ తీసుకొచ్చింది. టీ షర్ట్‌లకు బదులు కుర్తాలు ధరించడానికి మహిళలకు వీలు కల్పించింది. లింక్డ్‌ఇన్‌లోని పోస్ట్‌లో, Zomato ఒక వీడియోను షేర్ చేసింది. "ఇకపై Zomato మహిళా డెలివరీ భాగస్వాములు కుర్తా ధరించవచ్చు" అని అందులో రాశారు.


వీడియోలో చాలా మంది జొమాటో డెలివరీ మహిళలు కంపెనీ అందించే కొత్త కుర్తాలను ధరించి.. ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. "మహిళా డెలివరీ భాగస్వాములు జొమాటో టీ షర్టులతో అసౌకర్యాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి, మేం ఈ నిర్ణయం తీసుకున్నాం" అని Zomato పేర్కొంది.

కుర్తా ధరించిన తర్వాత ఓ మహిళ దానికి పాకెట్స్ కూడా ఉన్నాయంటూ సంతోషం వ్యక్తం చేసింది. సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానికి వేల సంఖ్యలో నెటిజన్లు కామెంట్లు, లైక్‌లు చేస్తున్నారు. కంపెనీ ఆలోచనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 09 , 2024 | 04:20 PM