Share News

Skydiving: రాముడి జెండాతో యువతి స్కైడైవింగ్.. ఏకంగా 13 వేల అడుగులపై నుంచి...

ABN , Publish Date - Jan 05 , 2024 | 08:37 AM

అయోధ్య రామనామస్మరణతో మార్మోగుతున్న వేళ ఓ యువతి చేసిన సాహసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ కి చెందిన అనామిక శర్మ బ్యాంకాక్ లో నివసిస్తోంది. చిన్నప్పటి నుంచే స్కైడైవింగ్(Skydiving)పై ఇష్టమున్న ఆ యువతి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఏదైనా ప్రత్యేకంగా చేయలనుకుంది.

Skydiving: రాముడి జెండాతో యువతి స్కైడైవింగ్.. ఏకంగా 13 వేల అడుగులపై నుంచి...

లఖ్ నవూ: అయోధ్య రామనామస్మరణతో మార్మోగుతున్న వేళ ఓ యువతి చేసిన సాహసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ కి చెందిన అనామిక శర్మ బ్యాంకాక్ లో నివసిస్తోంది. చిన్నప్పటి నుంచే స్కైడైవింగ్(Skydiving)పై ఇష్టమున్న ఆ యువతి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఏదైనా ప్రత్యేకంగా చేయలనుకుంది. జై శ్రీ రాం(Lord Sriram) అని రాసి ఉన్న జెండాను పట్టుకుని 13 వేల అడుగుల ఎత్తు నుంచి దూకింది. బ్యాంకాక్ లో డిసెంబర్ 22 ఆమె స్కైడైవింగ్ చేసింది.

ఎయిర్ ఫోర్స్ లో పని చేసిన తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని సాహసం చేసినట్లు ఆమె వివరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రామ భక్తిని చాటుకున్న యువతిని ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. కాగా అయోధ్యలో రామవిగ్రహ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 22న ప్రధాని మోదీ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Updated Date - Jan 05 , 2024 | 08:39 AM