Share News

Viral Video: భూమ్మీద మరే మహిళా ఇలా చేయలేదేమో.. భారీ కొండచిలువను ఈమె ఊహించని విధంగా..

ABN , Publish Date - Feb 12 , 2024 | 08:34 PM

ఉత్తచేతులతో కొండచిలువన పట్టుకుని లొంగదీసిన మహిళ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video: భూమ్మీద మరే మహిళా ఇలా చేయలేదేమో.. భారీ కొండచిలువను ఈమె ఊహించని విధంగా..

ఇంటర్నెట్ డెస్క్: పాములు, మొసళ్లను చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. అడవి జంతువులను హ్యాండిల్ చేయడంలో నిష్ణాతులైన వారు కూడా కాస్తంత ఆలోచించే ముందడుగు వేస్తారు. కానీ, నెట్టింట వైరల్‌గా (Viral Video) మారిన వీడియోలో ఓ మహిళ చేసిన సాహసం జనాల్ని షాక్‌కు గురిచేస్తోంది.


ఈ వీడియోను మైక్ హోల్స్‌స్టన్ అనే యూజర్ నెట్టింట షేర్ చేశాడు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, పొలంలో ఓ కొండచిలువ చుట్టచుట్టుకుని పడుకుని ఉంది. ఇంతలో..సంప్రదాయ చీరకట్టులో ఉన్న ఓ మహిళ ఆ భారీ పామును సమీపించింది. పామును ఉత్తచేతులతో పట్టుకుని పైకిలేపే ప్రయత్నం చేసింది. ఇంతలో పాము ఎదురు తిరిగింది. పెద్దగా నోరు తెరుస్తూ ఆమె వైపు చూసింది. పాము దాడి చేసే మూడ్‌లోకి వచ్చేసినా మహిళ మాత్రం బెదరలేదు. పైపెచ్చు, పామును బలంగా అదిమిపెట్టి లొంగదీసుకుంది. మహిళ పట్టులో కాన్ఫిడెన్స్ అర్థమైందేమో తెలీదు కానీ పాము కాస్తంత నెమ్మదించింది (Woman Tames Massive Snake Like A Puppy In Spine-Chilling Video).


వీడియో అక్కడితో ముగిసిపోయింది కానీ జనాలు మాత్రం ఈ సీన్ చూసి షాకైపోయారు. మహిళ ధైర్యం చూసి నెటిజన్లు దిమ్మెరపోయారు. ఉత్త చేతులతో పామును పట్టుకునేందుకు బోలెడంత ధైర్యం కావాలంటూ కామెంట్ చేశారు. ఇది బెరుకు మనస్తత్వం ఉన్న వాళ్లు చూడదగిన వీడియో కాదని, ఆమె చేసింది తలుచుకుంటేనే గుండె గుభిల్లుమంటోందని వ్యాఖ్యానించారు. భూమ్మీద ఇలాంటి సాహసం మరే మహిళా చేయదంటూ కామెంట్ చేశారు.

Updated Date - Feb 12 , 2024 | 08:37 PM