Share News

MS Dhoni: సూపర్ ఫామ్‌లో ఉన్న ధోనీ ముందుగా ఎందుకు రావడం లేదు? సీక్రెట్ బయటపెట్టిన సీఎస్కే కోచ్!

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:15 PM

ఈ ఐపీఎల్‌లో దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అదరగొడుతున్నాడు. చివరి ఓవర్లలో బ్యాటింగ్‌కు వస్తూ ఫోర్లు, సిక్స్‌లతో విరచుకుపడుతున్నాడు. ఇటీవల ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 4 బంతుల్లో 20 పరుగులు చేశాడు. తాజాగా లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో కూడా ధోనీ చెలరేగాడు.

MS Dhoni: సూపర్ ఫామ్‌లో ఉన్న ధోనీ ముందుగా ఎందుకు రావడం లేదు? సీక్రెట్ బయటపెట్టిన సీఎస్కే కోచ్!
MS Dhoni

ఈ ఐపీఎల్‌లో (IPL 2024) దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ (MS Dhoni) ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అదరగొడుతున్నాడు. చివరి ఓవర్లలో బ్యాటింగ్‌కు వస్తూ ఫోర్లు, సిక్స్‌లతో విరచుకుపడుతున్నాడు. ఇటీవల ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 4 బంతుల్లో 20 పరుగులు చేశాడు. తాజాగా లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో కూడా ధోనీ చెలరేగాడు (CSK vs LSG). చివరి రెండు ఓవర్లలో క్రీజులోకి వచ్చిన ధోనీ కేవలం 9 బంతులు మాత్రమే ఎదుర్కొని 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 పరుగులు చేశాడు.


నిజానికి ఈ మ్యాచ్‌లో ధోనీ మరింత ముందుగానే క్రీజులోకి రావాల్సింది. చెన్నై టాపార్డర్ బ్యాటర్లు త్వరగా అవుట్ కావడంతో ధోనీ త్వరగా క్రీజులోకి వస్తాడని అభిమానులు ఎదురు చూశారు. అయితే మొయిన్ అలీ రావడంతో చాలా మంది షాకయ్యారు. మొయిన్ అలీ అవుటయ్యాక చివరి రెండో ఓవర్లలో ధోనీ వచ్చి ఫోర్లు, సిక్స్‌లతో అభిమానులను అలరించాడు. అసలు ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు ఎందుకు రావడం లేదని చాలా మంది అభిమానులు అసహనంగా ప్రశ్నిస్తున్నారు.


ఈ ప్రశ్నకు సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సమాధానం చెప్పాడు. ``ధోనీ గేమ్, బ్యాటింగ్ చాలా మందికి స్ఫూర్తిదాయకం. అతను ఎన్నో ఏళ్లుగా క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. ఎంతో కాలంగా మోకాలి సమస్యతో బాధపడుతున్నాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ సమయంలో ధోనీ మీద ఎక్కువ ఒత్తిడి పెట్టలేం. అతడు ఎక్కువ సేపు ఆడితే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ, ధోనీ మాతో టోర్నమెంట్ అంతా ఉండాలి అనుకుంటున్నాం`` అంటూ ఫ్లెమింగ్ చెప్పాడు.

ఇవి కూడా చదవండి..

Shivam Dube: శివమ్ దూబే చీటింగ్ చేశాడా.. అంపైర్ ఎందుకలా చెక్ చేశాడు?


Rishabh Pant: రిషభ్ పంత్‌కి ప్రమోషన్.. టీమిండియా కెప్టెన్‌గా..?


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 20 , 2024 | 01:15 PM