Share News

Thailand: పర్యాటకుల కోసం థాయ్‌లాండ్ వినూత్న పథకం.. ఏకంగా అన్ని లక్షలు

ABN , Publish Date - Feb 15 , 2024 | 06:44 PM

రోనా మహమ్మారి(Covid 19) తరువాత పర్యాటక రంగాన్ని పునరుద్ధరించడానికి థాయ్‌లాండ్(Thailand) ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టడానికి రెడీ అవుతోంది.

Thailand: పర్యాటకుల కోసం థాయ్‌లాండ్ వినూత్న పథకం.. ఏకంగా అన్ని లక్షలు

బ్యాంకాక్: కరోనా మహమ్మారి(Covid 19) తరువాత పర్యాటక రంగాన్ని పునరుద్ధరించడానికి థాయ్‌లాండ్(Thailand) ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టడానికి రెడీ అవుతోంది. థాయ్‌లాండ్‌కి వచ్చే పర్యాటకులకు ప్రమాదం జరిగినా, ప్రాణాపాయం ఉన్నా వైద్య కవరేజీని అందించే పథకానికి కేబినెట్ ఆమోదించింది. దీని ప్రకారం.. ఆ దేశానికి వెళ్లిన పర్యాటకులకు ప్రమాదం జరిగితే 14 వేల డాలర్లు(రూ.12 లక్షలు) మెడికల్ కవరేజీ అందిస్తారు. పర్యాటకుడు మరణిస్తే మిలియన్ బాట్(రూ.23 లక్షలు) పరిహారం ఇస్తారు.

థాయ్ ప్రభుత్వం పర్యాటకుల భద్రత, శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. కరోనా సమయంలో విధించిన ప్రయాణ ఆంక్షల కారణంగా థాయ్ పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది. తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నించినప్పటికీ రికవరీ ఊహించిన దానికంటే నెమ్మదిగా జరిగింది. దీంతో ప్రభుత్వమే రంగంలోకి దిగి పర్యాటక రంగాన్ని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తోంది.


నమోదు చేసుకోండిలా..

థాయ్‌లాండ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి పర్యాటకులు థాయిలాండ్ ట్రావెలర్ సేఫ్టీ వెబ్‌సైట్ tts.go.th ద్వారా ప్రక్రియ పూర్తి చేయవచ్చు. 2019లో(కరోనాకు ముందు ) 40 మిలియన్ల మంది టూరిస్టులు సందర్శించారు.

కరోనా సమయంలో ఆ సంఖ్య ఎన్నో రెట్లు తగ్గగా.. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో 2023నాటికి 28 మిలియన్ల టూరిస్టులు వచ్చారు. ఈ ఏడాది 35 మిలియన్ల సందర్శకులను ఆకర్షించాలని ఆ దేశం టార్గెట్‌ పెట్టుకుంది. థాయ్ బడ్జెట్‌లో టూరిస్టుల నుంచి వచ్చే ఆదాయం అధికంగా ఉంటుంది.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2024 | 06:46 PM