Share News

Poonam Pandey: బతికే ఉన్నానంటూ పూనమ్ పాండే ప్రకటించడంపై రామ్ గోపాల్ వర్మ స్పందన.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ABN , Publish Date - Feb 03 , 2024 | 01:17 PM

తాను చనిపోలేదని, బతికే ఉన్నానంటూ బాలీవుడ్ బ్యూటీ ‘పూనమ్ పాండే’ ప్రకటించడంపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆసక్తికరంగా స్పందించాడు. గర్భశయ క్యాన్సర్‌పై అవగాహన కోసం పూనమ్ పాండే ఎంచుకున్న విధానంపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.

Poonam Pandey: బతికే ఉన్నానంటూ పూనమ్ పాండే ప్రకటించడంపై రామ్ గోపాల్ వర్మ స్పందన.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

తాను చనిపోలేదని, బతికే ఉన్నానంటూ బాలీవుడ్ బ్యూటీ ‘పూనమ్ పాండే’ ప్రకటించడంపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆసక్తికరంగా స్పందించాడు. గర్భశయ క్యాన్సర్‌పై అవగాహన కోసం పూనమ్ పాండే ఎంచుకున్న విధానంపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ‘‘హేయ్.. పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్‌పై దృష్టిని మరల్చడానికి నువ్వు అవలంభించిన విధానం కొంత విమర్శలకు దారితీయవచ్చు. కానీ ఈ బూటకంతో నువ్వు సాధించిన దానిని, నీ ఉద్దేశాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్‌పై సర్వత్ర చర్చ నడుస్తోంది. ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. నీ ఆత్మ కూడా నీ అంత చాలా అందంగా ఉంది. నువ్వు చాలా ఎక్కువ కాలం, సంతోషంగా జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని రామ్ గోపాల్ వర్మ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.

కాగా పూనమ్‌పాండే గర్భశయ క్యాన్సర్‌తో శుక్రవారం ఉదయం మరణించింది అంటూ ఆమె అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ దర్శనమిచ్చింది. దీంతో ఆమె కన్నుమూసినట్టు అంతా నిర్ధారణకు వచ్చారు. బాలీవుడ్‌కి చెందిన పలువురు కూడా ఆమె మరణవార్తను ధృవీకరించారు. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి. గత రెండు రోజులుగా ఆమె ట్రెండింగ్‌లో నిలిచారు. సర్వైకల్ క్యాన్సర్‌పై జోరుగా చర్చ సాగుతోన్న విషయం తెలిసిందే.

Updated Date - Feb 03 , 2024 | 01:47 PM