Anand Mahindra: న్యూఇయర్ వేళ పంజాబ్ పోలీసుల కొత్త ఆఫర్.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు..
ABN , Publish Date - Dec 31 , 2024 | 09:08 PM
నూతన సంవత్సరాన్ని తమదైన శైలిలో ఆహ్వానించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా యువత పూర్తిగా పార్టీ మోడ్‌లో ఉంటుంది. ఈ నేపథ్యంలో కొందరు వికృత చేష్టలకు కూడా పాల్పడుతుంటారు. అలాంటి వారిని కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తుంటారు.

మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరం (New Year) రాబోతోంది. నూతన సంవత్సరాన్ని తమదైన శైలిలో ఆహ్వానించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా యువత పూర్తిగా పార్టీ మోడ్‌లో ఉంటుంది. ఈ నేపథ్యంలో కొందరు వికృత చేష్టలకు కూడా పాల్పడుతుంటారు. అలాంటి వారిని కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో పంజాబ్ యువకులకు ఆ రాష్ట్ర పోలీసులు (Punjab Police) బంపరాఫర్లను ప్రకటించారు. ఆ పోస్ట్‌ను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
నూతన సంవత్సర వేళ వికృత చేష్టలకు పాల్పడితే తీసుకునే చర్యల గురించి పంజాబ్ పోలీసులు వినూత్నంగా సూచనలు జారీ చేశారు. ``2025, డిసెంబర్ 31 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. మీరు తాగి వాహనం నడుపుతున్నా, వీధుల్లో గొడవలకు దిగినా, లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగించినా పంజాబ్ పోలీసులు మీకు స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నారు. అలాంటి వారిని ఉచితంగా పోలీస్ స్టేషన్‌కు ఆహ్వానించి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ ఏడాది చివరి రాత్రిని ఎవరైనా నాశనం చేసేందుకు ప్రయత్నిస్తుంటే 112కు డయల్ చేసి మమ్మల్ని ఆహ్వానించండి`` అంటూ పంజాబ్ పోలీసులు ఫన్నీగా సూచనలు చేశారు.
పంజాబ్ పోలీసులు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ పోస్ట్ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కంట పడింది. ఆయన ఆ పోస్ట్‌ను రీ-ట్వీట్ చేసి పంజాబ్ పోలీసులను ప్రశంసించారు. పోలీసులు సోషల్ మీడియాను తమదైన శైలిలో వినియోగించుకుంటున్నారని కొనియాడారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..