Share News

Valentine's Day Week : ప్రేమికుల రోజు వీటికి ఫుల్ డిమాండ్.. ఆర్డర్లే ఆర్డర్లు...!

ABN , Publish Date - Feb 14 , 2024 | 12:57 PM

మనసులో దాగున్న ప్రేమను తెలిపేందుకు బహుమతులనే మార్గంగా ఎంచుకుంటూ ఉంటారు.

Valentine's Day Week : ప్రేమికుల రోజు వీటికి ఫుల్ డిమాండ్.. ఆర్డర్లే ఆర్డర్లు...!
February 14th

నిమిషానికి 350 గులాబీలు, 406 చాక్లెట్స్ ఆర్డర్స్ అదీ ఒక్క వారం ప్రేమికుల రోజు సంబరానికి మాత్రమే..

మొత్తం భారతదేశంలోనే ప్రేమికుల రోజు, వెలంటైన్ వీక్ సందర్భంగా పెరిగిన అమ్మకాలు నిజానికి విస్మయం కలిగిస్తున్నాయి. ప్రేమికులు తమ ప్రేమను గులాబీలు, చాక్లెట్స్‌తో తెలిపి సంతోషపడుతున్నారు. ఈ సందర్భంగా పెరుగుతున్న వ్యాపారం గురించి చెప్పుకోవాలంటే దాదాపు ప్రతి నిమిషానికి 350 గులాబీలు, 406 చాక్లెట్స్ ఆర్డర్ అందుకుంటున్నారట. ప్రేమికుల సంబరాలు మొదలయ్యింది. దీనికోసం గులాబీలను, చాక్లెట్స్ ను ఆన్లైన్ ద్వారా అమ్మాకాలు కూడా చాలా ఎక్కువగానే జరుగుతున్నాయి. గులాబీలకైతే మరీ డిమాండ్ పెరిగింది.

ప్రేమను తెలిపేందుకు గిఫ్ట్సే దారి...!

ఎక్కడో ఉన్నవారు తమ ప్రేమికుడిని, ప్రేమికురాలిని ప్రేమగా పలకరించడానికి గిఫ్ట్స్ ద్వారానే సాధ్యం. ఎంత ఫోన్స్ చేసుకున్నా ప్రేమగా మాట్లాడుకున్నా కూడా నచ్చిన వారు ఇచ్చే బహుమతి హృదయానికి తాకుతుంది. ప్రత్యేకించి ప్రేమికుల వారంగా ప్రపంచం అంతా ప్రేమ పూస్తూనే ఉంటుంది. యువతలో ప్రేమ తరంగాలు ఒకచోట నుంచి మరోచోటికి ప్రయాణిస్తూనే ఉంటాయి. మనసులో దాగున్న ప్రేమను తెలిపేందుకు బహుమతులనే మార్గంగా ఎంచుకుంటూ ఉంటారు. చిన్న చిన్న సర్ఫైజ్ లు, పార్టీలు, విందులు వినోదాలు సరే కానీ చక్కని ఎర్రని గులాబీ బొకేతో ప్రేమను తెలిపితే ఆ కళ్ళల్లో ఆనందం మాటల్లో చెప్పలేం. గత వారంగా ప్రేమికులు లోకం అంతా ఈ ప్రేమ సంబరాల్లోనే మునిగి తేలుతోంది.

అలా వారం అంతా..

ఫిబ్రవరి 7వ తేదీ మొదలుకొని రోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రపోజ్ డే, ప్రామిస్ డే, హగ్ డే, చివరిగా ప్రేమికులు ఎదురుచూసే వేలన్డైన్స్ డే.. దీనితో ప్రేమ సంబరాలు ముగుస్తాయి. ఈ రోజులన్నీ ఒకరికి ఒకరు బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. ప్రేమను తెలుపుకుంటూ ఉంటారు. వీటికి ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్స్, డైటింగ్ సైట్స్, కొత్త కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడం, రొమాంటిక్ మూమెంట్స్ ని ఆర్గనైజ్ చేయడం వంటి కార్యక్రమాలను చేస్తాయి. ఇక వీటి ఆర్భాటాలు ఇలా ఉంటే.. ప్రేమికుల వారంలో పెద్ద మొత్తాలను పట్టేసే రోజ్, చాక్లెట్స్ కైతే లెక్కేలేదు. కుప్పలు తెప్పలుగా ఆర్డర్స్ వచ్చిపడుతున్నాయని తెలుపుతున్నారు.

తాజాగా జొమాటో సిఇఓ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసారు. ఫిబ్రవరి వారం 9 తారీఖున ఒక్కరోజే 406 చప్పున నిమిషానికి ఆర్డర్స్ అందుకున్నామని తెలిపింది. ఇది పెరుగుతూ వచ్చి, నిమిషానికి 20000 చాక్లెట్స్ ఆర్డర్స్ తీసుకున్నట్టుగా తెలిపారు.

Updated Date - Feb 14 , 2024 | 01:01 PM