Share News

Video: బస్సు ఆపి రోడ్డు దాటిన చిన్నారి.. తరువాత పాప చేసిన పని చూస్తే షాక్

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:42 PM

చిన్నారులు ఏ పని చేసినా చూడ ముచ్చటగా ఉంటాయి. వారి అల్లరిలోనూ ఎంతో ప్రేమ ఉంటుంది. జపాన్(Japan)కి చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా(Viral Video) మారింది. ఇందులో ఓ బాలిక జీబ్రాక్రాసింగ్ వద్ద వచ్చి నిల్చుని.. రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుంటుంది.

Video: బస్సు ఆపి రోడ్డు దాటిన చిన్నారి.. తరువాత పాప చేసిన పని చూస్తే షాక్

టోక్యో: చిన్నారులు ఏ పని చేసినా చూడ ముచ్చటగా ఉంటాయి. వారి అల్లరిలోనూ ఎంతో ప్రేమ ఉంటుంది. జపాన్(Japan)కి చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా(Viral Video) మారింది. ఇందులో ఓ బాలిక జీబ్రాక్రాసింగ్ వద్ద వచ్చి నిల్చుని.. రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుంటుంది. అటుగా ఓ బస్సు వేగంగా వస్తుంటుంది. దీన్ని చూసిన పాప బస్సును ఆపాలంటూ చేయి అడ్డు పెడుతుంది. ఆమెను గమనించిన డ్రైవర్ వెంటనే బస్సు వేగాన్ని తగ్గించి.. జీబ్రా క్రాసింగ్ ముందుగానే ఆపేస్తాడు.

బస్సు ఆగడంతో ఆమె రోడ్డును చకచకా దాటేస్తుంది. రోడ్డు దాటిన వెంటనే వెనక్కి తిరిగి బస్సు ఆపిన డ్రైవర్ కి నమస్కారం పెడుతుంది. దీన్ని చూసిన డ్రైవర్ చిన్నారి చేసిన పనిని చూసి ముగ్ధుడవుతాడు. అనంతరం థ్యాంక్యూ చెబుతూ ముందుకు సాగింది ఆ పాప. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కారులో ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వేలసంఖ్యలో నెటిజన్లు వీడియోను షేర్ చేస్తున్నారు.

చిన్నారి పనికి ఫిదా అయిపోయామని కామెంట్లు చేస్తున్నారు. జపాన్ అంటే టెక్నాలజీ, బుల్లెట్ రైళ్లు మాత్రమే కాదని ఈ వీడియో నిరూపించిందని ఒకరు కామెంట్ చేశారు. జపాన్ సంస్కృతికి ఈ వీడియో అద్దంపాడుతోందని మరొకరు అన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 12:43 PM